అన్వేషించండి

February Horoscope 2024 :ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం

February horoscope 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఫిబ్రవరి నెల రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

February Horoscope 2024: ఫిబ్రవరి నెలలో ఈ  రాశులవారికి మిశ్రమఫలితాలున్నాయి. ముఖ్యంగా కుంభ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాలి. 

కర్కాటక రాశి  (Cancer February Monthly Horoscope 2024)

కర్కాటక రాశివారు ఈ నెలలో తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.  ఈ రాశి ఉద్యోగులు నెల ప్రారంభంలో కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చు . సీనియర్లు, జూనియర్ల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించదు. మీకు ఇది గుడ్ టైమ్ కాదు కాబట్టి...మీరు అందర్నీ కలుపుకుని వెళ్లిపోవడమే మంచిది. నెల మధ్యలో చిన్న లేదా దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో మీ వస్తువులపై చాలా శ్రద్ధ వహించండి . ఈ రాశి వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏమైనా ఉంటే కోర్టు బయటే పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగం, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి.

Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!

కన్యా రాశి  (Virgo February Monthly Horoscope 2024)

కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. నెల ప్రారంభంలో బిజీగా ఉంటారు. ఉద్యోగ పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.  కమీషన్‌పై పనిచేసేవారు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆహారపు అలవాట్ల విషయంలో శ్రద్ధ వహించాలి. ఉపాధి కోసం చూస్తున్నవారికి ఫిబ్రవరి నెలాఖరులోగా మంచి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో మీ ప్రత్యర్థుల కదలికలు విఫలమవుతాయి..మీ కృషికి తగిన ఫలితం పొందుతారు.  మిమ్మల్ని మీరు మెరుగ్గా నిరూపించుకోవడంలో  మరోసారి విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి ఈ మాసం ద్వితీయార్థం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు విదేశాల్లో స్థిరపడాలని లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో, మీరు మీ ప్రేమ భాగస్వామి యొక్క భావాలను విస్మరించకూడదు.  

Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!

వృశ్చిక రాశి (Scorpio February Monthly Horoscope 2024)

ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ఆలోచన అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కెరీర్ కి సంబంధించి తీసుకునే నిర్ణయాలపై పునరాలోచించాలి. మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో ఆలోచనాత్మకంగా అడుగేయాలి. మీపై ఎవ్వరి ప్రభావం పడకూడదు...దీనివల్ల భవిష్యత్ లో పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమపనిని వేరొకరిపై వదిలేయకుండా ఉండడమే మంచిది. సహోద్యోగుల నుంచి సరైన మద్దతు లభించదు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు ఓసారి చదవండి. చేసే పనిలో తప్పుడు మార్గాన్ని ఆశ్రయించవద్దు. నెల మధ్యలో కుటుంబంలో సమస్యలు మీకు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం గురించి కూడా మనసు ఆందోళన చెందుతుంది. మీ ప్రేమ సంబంధంలో ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోవడం మర్చిపోవద్దు. నెల చివరి భాగం మీ వృత్తి మరియు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆశించిన పురోగతిని పొందుతారు.

Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం

ధనుస్సు  రాశి (Sagittarius February Monthly Horoscope 2024)

ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉండబోతోంది. ఈ నెలలో మీరు మీ కెరీర్ , వ్యాపారంలో కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు. అయితే, మీరు క్లిష్ట పరిస్థితుల్లో మీ బంధువుల నుంచి మద్దతు పొందుతారు. నెల ప్రారంభం నుంచి వృధా ఖర్చులకుమదూరంగా ఉండండి. ఉద్యోగులు తమ సీనియర్లు, జూనియర్లను కలుపుకునివెళ్లాలి. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మానేసి, మీ పనిలో 100 శాతం కృషి చేయండి. మీ మాటతీరుతో వ్యాపారం, ఉద్యోగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ముందు మిమ్మల్ని పొగిడే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. నెల మొదటి భాగంలో కన్నా రెండో భాగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఓ ప్రత్యేకవ్యక్తినుంచి మీరు కోరుకున్న ప్రయోజనాలు పొందుతారు.

మకర రాశి (Capricorn February Monthly Horoscope 2024)

మకర రాశివారు ఈ నెలలో ఏ విషయంలోనూ అతి చేయవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాసం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వాగ్వాదం కారణంగా నిరాశకు గురవుతాయి. అనవసర వాదనలు వద్దు, పరుష పదాలు వినియోగించవద్దు. ప్రేమ లేదా వైవాహిక సంబంధాన్ని మెరుగుపర్చుకునేందుకు...మీ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి. వృత్తి జీవితంలో భాగంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలుంటాయి. వ్యాపార విస్తరణ దిశగా ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న డబ్బు అనుకోకుండా చేతికందుతుంది. పితృ ఆస్థి సంపాదనలో అడ్డంకులు తొలగిపోతాయి. నెల రెండవ భాగంలో పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.

Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే

కుంభ రాశి (Aquarius February Monthly Horoscope 2024)

 కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెల ప్రారంభం కొంత సవాలుగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు ఇంటా బయటా అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా అంతబాగోదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఉద్యోగులకు ఈ నెలలో వారి లక్ష్యాలను సాధించడానికి అదనపు శ్రమ , కృషి అవసరం. వ్యాపారులు మార్కెట్‌లో మాంద్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి. నెలలో రెండవ వారంలో కొన్ని పెద్ద ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. విద్యార్ధులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది.  బంధువులతో ఏదో ఒక విషయంలో వాగ్వివాదం తలెత్తవచ్చు. సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ నెల ద్వితీయార్థంలో చేపట్టిన పనులు పూర్తికావాలంటే అందరితో కలసికట్టుగా పనిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలన్న మీ కల నెరవేరుతుంది. 

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!
Embed widget