పౌర్ణమి అమావాస్యకి రంగులు మారే శివలింగం పంచారామాల్లో నాల్గవది సోమారామం శ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంది. ఈ శివలింగానికి ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే పౌర్ణమి-అమావాస్యకి రంగులు మారుతుంది అమావాస్యకి గోధుమరంగులో మారుతుంది పౌర్ణమికి తెల్లగా మారిపోతుంది చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ శివలింగానికి ఈ ప్రత్యేకత అని చెబుతారు. సోముడు ప్రతిష్టించినందున ఈ క్షేత్రానికి సోమారామం పేరొచ్చింది. తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమార స్వామి...తన కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ముక్కలైన ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామాలుగా పిలుస్తారు జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జమ్మ ఉండదని చెబుతారు. Image Credit: Pinterest