పార్వతీదేవి జన్మస్థలం ఇది - పంచారామాల్లో మొదటిది! పంచారామాల్లో మొదటిది ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది. దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీనికి ద్రాక్షారామం పేరు వచ్చింది. ద్రాక్షారామం పార్వతీదేవి జన్మస్థలమని భక్తులు విశ్వాసం. ఇక్కడ అమ్మవారు శ్రీచక్రస్థిత మాణిక్యాంబదేవిగా విరాజిల్లుతోంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఇదీ ఒకటి. చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించడంతో..ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు 60 అడుగులు గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ద్రాక్షారామంలో శివలింగం సగం నలుపు, సగం తెలుపు వర్ణంలో ఉంటుంది. Image Credit: Pinterest