జలలింగం - శివం పంచభూతాత్మకం తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు (నేరేడు చెట్లు) ఎక్కువగా ఉండేవి. అందుకే జంబుకేశ్వరం అని పేరొచ్చిందని చెబుతారు. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడని స్థల పురాణం కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. పానపట్టంపై కప్పిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తుంటారు. న్నై నుంచి 331 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు Images Credit: Pinterest