ఆకాశ లింగం - చిదంబర రహస్యం అంటే ఇదే! తమిళనాడు రాష్ట్రం చిదంబరంలో కొలువైంది ఆకాశలింగం - చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే కనిపిస్తుంది. అంటే నిరాకారుడుగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు. శంకరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా చిదంబరం ప్రసిద్ధి. అందుకే నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. చిదంబర క్షేత్రం చెన్నై నుంచి 229 కిలోమీటర్ల దూరంలో ఉంది Images Credit: Pinterest