శరీరంలో 10 వాయువులు - ఏది ఆగినా!

ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండేది ప్రాణవాయువు

అపానవాయువు
తిన్న ఆహారం విసర్జించేందుకు ఉపయోగపడేదే అపాన వాయువు

వ్యానము
శరీరం వంగడానికి కారణమయ్యేది - శరీరం సంకోచ, వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు

ఉదానము
శరీరంలో కామ ప్రచోదనం చేసే వాయువు ఉదానము.

సమానము
జీర్ణం అయిన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానంగా ప్రసరించేలా చేస్తుంది

నాగము
జీర్ణాశయంలో అధిక వాయువు ఉండకుండా సహాయం చేసేది నాగము - ఇదే త్రేణుపు

కూర్మము
కళ్లుమూసి తెరిచేందుకు అవసరమయ్యే గాలిని కూర్మము

కృకరము
తుమ్మే సమయంలో వచ్చే గాలి కృకరము

దేవదత్తము
ఇంద్రియములు పనిచేసేందుకు సహకరించేది దేవదత్తము. ఇదే ఆవులింత.

ధనుంజయము
శరీరంలో ప్రాణం పోయినా దహనం అయ్యేవరకు ఉండే వాయువు ధనుంజయము.