వాయులింగం - శంకరుడి శ్వాస తగిలి రెపరెపలాడే దీపాలు! ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మిస్తారు కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి. స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే శ్రీకాళహస్తి వాయులింగంగా ప్రసిద్ధి విజయవాడకు 377 కిలోమీటర్ల దూరంలో...తిరుపతి నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు Images Credit: Pinterest