ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం - పంచారామక్షేత్రాల్లో రెండోది! ఇది గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో వెలసింది. ఇక్కడ స్వామివారు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు రెండు అంతస్తులలో 16 అడుగుల ఎత్తుతో ఈ స్పటిక శివలింగం ఉంటుంది రెండవ అంతస్తుపై నుంచి స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమరేశ్వర లింగం ఎత్తు 35 అడుగులు. ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని..అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అని పేరు. తారకాసురుడిపై యుద్ధానికి వెళ్లిన కుమార స్వామి...తన కంఠంలో కొలువై ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ముక్కలైన ఆ ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటినే పంచారామాలుగా పిలుస్తారు జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శించుకుంటే పునర్జమ్మ ఉండదని చెబుతారు. Images Credit: Freepik