సీతారాములు ప్రతిష్ఠించిన శివలింగం - పంచారామాల్లో ఒకటి! పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది క్షీరారామం. ఈ శివలింగాన్ని త్రేతాయుగంలో సీతారాములు ప్రతిష్ఠించారని విశ్వసిస్తారు. లింగం పైభాగం మొనదేలి ఉండటం వలన స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖస్వరూపుడుగా దర్శనమిస్తాడు. కౌశిక ముని కుమారుడు ఉపమన్యుడు శివుడిని నిత్యాభిషేకానికి కావాల్సిన క్షీరాన్ని కోరాడట. అనుగ్రహించిన పరమేశ్వరుడు క్షీర సముద్రాన్నే సృష్టించాడట. అందుకే క్షీరారామంగా...కాలక్రమేణా పాలకొల్లుగా మారింది 125 అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్పసంపదతో విశేషంగా ఆకట్టుకుంటుంది. చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. Images Credit: Pinterest