అన్వేషించండి

February Horoscope 2024 : ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!

February horoscope 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఫిబ్రవరి నెల రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

February Horoscope 2024: ఫిబ్రవరి నెలలో ఈ 6 రాశులవారికి మంచి ఫలితాలే ఉన్నాయి. వృషభం, మిథునం రాశులవారికి చిన్న చిన్న సమస్యలు తప్పవు కానీ వాటిని ఎదుర్కోగలుగుతారు. 

మేష రాశి (Aries February Monthly Horoscope 2024)

ఫిబ్రవరి నెల మేషరాశి వారికి చాలా సంతోషాన్ని , విజయాన్ని అందిస్తుంది. నెల ప్రారంభంలో మీకు అదృష్టం  కలిసొస్తుంది. చేపట్టే ఏ పనిలో అయినా స్నేహితులు , కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉంటుంది. కార్యాలయంలో ఉత్తమ పనితీరును అందించడంలో మీరు విజయం సాధిస్తారు. మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫిబ్రవరి నెల రెండోవారంలో కోర్టు సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ అహం పురోగతికి అడ్డం కావొచ్చు. చేసే పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించండి. సామాజిక సర్కిల్ పెరుగుతుంది. ఈ నెల చివర్లో ఖర్చులు పెరుగుతాయి...ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

Also Read: ఈ రాశులవారు జీవితంలో కొత్త మార్పులొస్తాయి, జనవరి 31 రాశిఫలాలు

వృషభ రాశి (Taurus February Monthly Horoscope 2024)

వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల మిశ్రమంగా ఉంటుంది. నెల ప్రారంభం కొంత ఆందోళన ఉంటుంది. పిల్లలకి సంబంధించిన ఏదైనా సమస్య గురించి మీ మనస్సు ఆందోళన చెందుతుంది. ఆకస్మిక ఖర్చులుంటాయి.  ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు..నెల మధ్యలో మీకు అనుకూలమైన విషయాలు చూస్తారు. నెలలో రెండో వారంలో కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి ఆశించిన మద్దతు లభించదు. వ్యాపారంలో ఉన్నట్లయితే లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజీ షెడ్యూల్ కారణంగా కుటుంబానికి సమయం దొరకక మీ మనస్సు ఆందోళన చెందుతుంది. కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నెల చివరి సగం మీకు అన్నీ అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. 

మిథున రాశి Gemini February Monthly Horoscope 2024)

చిన్న చిన్న సమస్యలు మినహా మిథున రాశివారికి ఫిబ్రవరి శుభప్రదంగానే ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు గుడ్ న్యూస్ వింటారు. వృత్తి, వ్యాపారం కోసం అన్వేషణ పూర్తవుతుంది. పెండిగ్ లో ఉన్న కొన్ని పనులు పూర్తిచేస్తారు. చాలా కాలంగా వాహనం లేదా ఏదైనా విలాసవంతమైన వస్తువు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఈ నెల రెండోవారంలో అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకునే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. సామాజిక రంగంలో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. నెల చివర్లో డబ్బు కొరత ఉండొచ్చు..

Also Read:  ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం

సింహ రాశి  (Leo February Monthly Horoscope 2024)

సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మొదటి అర్థభాగం అదృష్టాన్నిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు నెల ప్రారంభంలోనే పూర్తవుతాయి.  మీపై మీరు విశ్వాసం కలిగి ఉంటారు. కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు పొందుతారు. మీ పనితీరుకి ప్రసంశలు లభిస్తాయి. ఈ నెలలో మీరు కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు..ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది.  కొనసాగుతున్న ఏదైనా కోర్టు కేసు లేదా ఆస్తి వివాదాలలో మీరు విజయం సాధిస్తారు. ఈ నెల సెకెండాఫ్ నుంచి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యుడు లేదా జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. కూర్చుని మాట్లాడి సమస్య పరిష్కరించుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. 

తులా రాశి (Libra February Monthly Horoscope 2024)

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే ఫిబ్రవరి నెల తులారాశి వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో సంతోషంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు ఇప్పుడు ప్రయోజనం చేకూర్చుతాయి. వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగుల పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీ లేదా పదోన్నతి కోరిక నెరవేరవచ్చు. మీ కుటుంబానికి సంబంధించిన శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. మీకు ఎవరితోనైనా భూమి, భవనం విషయాలలో వివాదం ఉంటే ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో దాన్ని పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తిని పొందడంలో అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగాల కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తుంటే ఫిబ్రవరి మధ్యలో మీరు విజయం సాధిస్తారు.  వృత్తి, వ్యాపార పురోగతికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  నెల చివరి భాగంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు మరింత కష్టపడాల్సిందే.

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

మీన రాశి (Pisces February Monthly Horoscope 2024)

ఫిబ్రవరి నెల మీనరాశి వారికి సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది. చాలా కాలంగా ఉపాధి కోసం వెతుకుతున్న వారికి ఈ నెలలో ఓ వ్యక్తి సహాయంతో మంచి అవకాశాలు లభిస్తాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి మీకు అన్నీ అనుకూల ఫలితాలే కనిపిస్తాయి. వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. ఎప్పటి నుంచో వేస్తున్న వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఇప్పుడు అమలవుతాయి.  పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నెల మధ్యలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద విజయం మీ గౌరవాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో మార్పు లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరవచ్చు. ఉద్యోగస్తులు అదనపు ఆదాయ వనరులు ఏర్పరుచుకుంటారు. విలాసాలకు సంబంధించి ఖర్చు చేస్తారు. నెలాఖరున స్నేహితులతో కలసి దూరప్రాంత ప్రయాణాలు అకస్మాత్తుగా చేయాల్సి రావొచ్చు.

Also Read: మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Advertisement

వీడియోలు

WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
Rohit Sharma and Virat Kohli | ఆస్ట్రేలియా సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు బాదేస్తాడన్న హర్బజన్ సింగ్
KL Rahul Injury |  విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్‌
Bodyline Bowling History | క్రికెట్ కారణంగా ఆసీస్, ఇంగ్లండ్‌లు శత్రువులుగా ఎలా మారాయి? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
రోజూ 10–15 km సిటీ డ్రైవ్‌ కోసం ₹10-12 లక్షల్లో వచ్చే బెస్ట్‌ CNG కార్ల లిస్ట్‌ - మీ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి
రోజూ సిటీలో 10–15 km డ్రైవ్‌ చేస్తాను, ₹10-12 లక్షల్లో బెస్ట్‌ CNG కారు ఏది?
Konda Murali Reaction :
"రేవంత్‌తో విభేేదాలు లేవు, సుస్మిత ఏ పార్టీలోనూ లేరు" అర్ధరాత్రి హైడ్రామాపై స్పందించిన కొండా మురళి
Mithra Mandali OTT: థియేటర్లలో నవ్వుల 'మిత్ర మండలి' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
థియేటర్లలో నవ్వుల 'మిత్ర మండలి' - ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
Konda Surekha Vs Revanth Reddy: బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
బీసీలపై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు! మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు!
Embed widget