KL Rahul Injury | విండీస్ రెండో టెస్ట్‌లో గాయపడిన కేఎల్ రాహుల్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అల్లాడిపోయాడు. వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి కేఎల్ రాహుల్‌కు తాగలరాని చోట తగిలింది. దీంతో రాహుల్ మైదానంలోనే కుప్పకూలి నొప్పితో విలవిలలాడిపోయాడు. యోగాసనాలు వేస్తూ సతమతమయ్యాడు. రాహుల్ పరిస్థితిని చూసి టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ఫిజియోను కూడా పట్టించుకునే స్థితిలో రాహుల్ లేడు. కొద్దిసేపు నొప్పితో బాధపడిన తర్వాత కొద్దిగా తేరుకుని.. ఫిజియోలు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో.. మళ్లీ బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. టీమిండియా రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్‌లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 140 ప్లస్ స్పీడ్‌తో జైడన్ సీల్స్ వేసిన బంతుల్ని.. రాహుల్ డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ఓవర్ తొలి బంతిని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్న రాహుల్.. రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి పంపించాడు. కానీ మూడో బంతిని సీల్స్ లెంగ్త్‌లో వేయడంతో.. రాహుల్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ బంతి బ్యాట్‌ను మిస్ చేస్తూ.. డైరెక్ట్‌గా రాహుల్ రెండు కాళ్ల మధ్యలో బలంగా తగిలింది. దాంతో రాహుల్ నొప్పితో అల్లాడిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే విచిత్రం ఏంటంటే.. ఈ ఇన్సిడెంట్‌పై చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. 'సామాన్లు జాగ్రత్త.. రాహుల్'అని సెటైర్లు పేల్చుతున్నారు.





















