BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకి ఆస్ట్రేలియాతో రాబోయే వన్డే సిరీస్ చివరి అంతర్జాతీయ సిరీస్ అవుతుందా? ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరిలో ఇదే డౌట్ ఉంది. దానికి తోడు.. ఆల్రెడీ రోకో టెస్ట్‌లు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఇక ఆసీస్ సిరీస్ తర్వాత తమ అభిమాన క్రికెటర్లని గ్రౌండ్‌లో చూడలేం ఏమో అని ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. దీనికి తోడు 2027లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సమయానికి 'రో-కో' వయస్సు దాదాపు 40, 39 అవుతుంది. సో.. వాళ్లు వన్డే వరల్డ్ కప్ ఆడతారా..? లేదా..? అనేది డౌటే. ఆ ఉద్దేశంతోనే శుభ్‌మన్ గిల్‌ను బీసీసీఐ వన్డే కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం, అలాగే అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఈ మధ్య 'ఇండియా-ఏ' తరఫున అద్భుతంగా రాణించడంతో రోకో ఫ్యూచర్ ఏంటని ఫ్యాన్స్‌లో భయం మొదలైంది.
అయితే ఈ భయాలన్నింటినీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఒక్క ఆన్సర్‌తో కొట్టిపారేశారు. దీంతో రోకో ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ టీమిండియా గెలిచిన తర్వాత ..ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్, విరాట్‌ల రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ.. "రిటైర్ అయ్యే నిర్ణయం పూర్తిగా ఆటగాళ్లదే. ఇది వారికి చివరి సిరీస్ అవుతుందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు’ అంటూ కొట్టిపారేశారు.
అలాగే, ఆస్ట్రేలియా టూర్ కోసం వీరిద్దరినీ సెలక్ట్ చేయడంపై హ్యాపీగా ఉన్నానన్న శుక్లా.. ఇద్దరూ గొప్ప బ్యాట్స్‌మెన్లు. వాళ్లిద్దరి సహకారంతో మనం ఆస్ట్రేలియాను ఓడించగలం" అని కాన్పిడెంట్‌గా చెప్పారు.




















