అన్వేషించండి

Horoscope Today 31st January 2024: ఈ రాశులవారు జీవితంలో కొత్త మార్పులొస్తాయి, జనవరి 31 రాశిఫలాలు

Horoscope Today 31st January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 31st January  2024  - జనవరి 31 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి కొన్ని అడ్డంకులు తప్పవు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏదో తెలియని బాధ ఉంటుంది. పని ఒత్తిడి వెంటాడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించడం మంచిది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

రోజంతా సంతోషంగా ఉంటారు కానీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ అధిక ఖర్చులు ఇబ్బందిపెడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి ఈ రోజు కలిసొస్తుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు.

మిథున రాశి (Gemini Horoscope Today) 

వ్యాపారంలో లాభం ఉంటుంది. ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితుల సహాయంతో ఆర్థిక లాభం పొందుతారు. నూతన ఆదాయ వనరుల నుంచి డబ్బు వస్తుంది. సంతోషంగా ఉంటారు. 

Also Read: శివభక్తులకు వరాలు ఈ క్షేత్రాలు - అన్నీ ఏపీలోనే ఉన్నాయ్!

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఖర్చులను నియంత్రించండి.  వృత్తి జీవితంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి.  అంకితభావంతో చేసే పని అపారమైన విజయాన్ని అందిస్తుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది.

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు సింహ రాశి వారు కష్టానికి తగిన ఫలాలు అందుతాయి. మీరు కెరీర్‌లో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు వస్తాయి. మీ భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభవార్త అందుతుంది. వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

మీరు ప్రారంభించిన పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ వాటిని అధిగమిస్తారు. కార్యాలయంల రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. 

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

తులా రాశి (Libra Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా శుభదినం. విదేశాల్లో ఉద్యోగం లేదా చదువుకునేందుకు ప్రయత్నించేవారికి ఇదే మంచి సమయం. కుటుంబ, స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు.  ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపంగా వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోవాల్సిందే. మీ లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృత్తి జీవితంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. కుటుంబం , స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో చాలా మార్పులు వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి. మునుపటి పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. మీ కెరీర్‌లో మీ ప్రతిభను ప్రదర్శించడానికి  అవకాశాలు లభిస్తాయి.  పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండండి.

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.  సోదరుడు లేదా సోదరితో విభేదాలు ఉండవచ్చు. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా కుటుంబంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు ఈ రోజు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

మకర రాశి (Capricorn Horoscope Today) 

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. సామాజిక  ప్రతిష్ట పెరుగుతుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడులను ఇస్తాయి. వృత్తి జీవితంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. వ్యాపారం  బాగానే సాగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవితంలో కొత్త మార్పులను అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల వల్ల లాభం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త అందుకుంటారు. వైవాహిక జీవితంలో ప్రేమ  పెరుగుతాయి. కార్యాలయంలో రాజకీయాల ప్రభాలం మీ పనితీరుపై చూపిస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి ... కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి.

Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!

మీన రాశి (Pisces Horoscope Today) 

ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై చర్చ జరగవచ్చు. కొందరు కుటుంబంతో కలసి టూర్ గురించి ప్లాన్ చేసుకుంటారు. మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్లాన్ చేసుకోండి. 

Also Read: మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Embed widget