(Source: ECI/ABP News/ABP Majha)
10 Vayu's in human Body : మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!
10 Vayu's in human Body : పంచ ప్రాణాలు అంటే ఏంటి? ఇవి శరీరాన్ని నడిపించేందుకు ఎలా సహకరిస్తాయి? శరీరాన్ని నడిపించేందుకు పది వాయువులు పనిచేయాలని మీకు తెలుసా...
Names of 10 Vayus inside a Human Body: గాలి పీల్చుకోవడం, విడిచిపెట్టడమే కాదు.. కనురెప్పల కదలిక నుంచి తుమ్మడం, ఆవలింత వరకూ ప్రతి చర్య వెనుకా ఉన్నది వాయువే. ఇలా శరీరాన్ని మొత్తం పది వాయువులు నడిపిస్తున్నాయి. అసలు శరీరం పనిచేసేందుకు కావాల్సింది వాయువే. శాస్త్రం ప్రకారం మన శరీరంలో పది వాయువులు ఉంటాయి.
ప్రాణవాయువు
ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉండేది ప్రాణవాయువే. ప్రాణవాయువు హృదయం నుంచి నాసిక వరకు రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాల ద్వారా సంచరిస్తుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి మనిషి మరణిస్తాడు.
వ్యానము
శరీరం వంగడానికి కారణం ఈ వాయువే. శరీరం సంకోచ, వ్యాకోచాలకు కారణమయ్యే వాయువు ఇది. శరీరంలోని ప్రతినాడిలో సంచరించి రక్తప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతుంది, లేకపోతే పక్షవాతం వంటి రోగాలు సంభవిస్తాయి.
Also Read: ఈ రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం- జనవరి 27 రాశిఫలాలు
ఉదానము
శరీరంలో కామ ప్రచోదనాన్ని కలిగించే వాయువు ఉదానము. శరీర భాగాలు అప్పుడప్పుడు అదురుతుంటాయి కదా..దానికి కారణం కూడా ఈ వాయువే. కంఠంలో ఉండిపోయే వ్యర్థ్యాలను బయటకు పంపించేందుకు సహకరించేది కూడా ఈ వాయువే..
సమానము
నాభి లో ఉండే సమాన వాయువు...జీర్ణం అయిన ఆహారం రక్తం, పిత్తం, శ్లేష్మంగా మార్చి, శరీరం అంతా సమానంగా ప్రసరించేలా చేస్తుంది సమాన వాయువు.
నాగము
జీర్ణాశయంలో అధిక వాయువు ఉండకుండా సహాయం చేసేది నాగము. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే త్రేణుపు. కడుపునిండా తిన్నప్పుడు...హెవీగా అనిపించినప్పుడు ఈ వాయువు గొంతు ద్వారా బయటకు వస్తుంది. అప్పటికి కానీ భారం తగ్గదు...
అపానవాయువు
తిన్న ఆహారం విసర్జించేందుకు ఉపయోగపడేదే అపాన వాయువు. పూర్తిగా జీర్ణం కాని కార్బోహైడ్రేట్స్ వలన ఈ గ్యాస్ తయారవుతుంది. ఇలా తయారైన గ్యాస్ మొత్తం బయటికి రావాలి. ఇందులో కొంతభాగాన్ని మానవ శరీరం సహజంగా పీల్చేసుకుంటుంది. సాధారణంగా అపానవాయువును ఆపుకోకూడదు.
Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!
కూర్మము
కళ్లుమూసి తెరిచేందుకు కూడా గాలి అవసరం ఉంటుందంటే మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం. కను రెప్పలు మూసి తెరిచే సమయంలో అవసరమయ్యే గాలిని కూర్మము అంటారు
కృకరము
తుమ్మడం కూడా వాయువు ద్వారానే...ఈ సమయంలో వచ్చే గాలిని కృకరము అంటారు
దేవదత్తము
ఇంద్రియములు పనిచేసేందుకు సహకరించేది దేవదత్తము...దేవదత్తము అంటే అందరకీ తెలియకపోవచ్చు కానీ ఆవులింత అంటే అర్థమవుతుంది. ఆవులింతకు సహకరించే గాలి దేవదత్తము.
Also Read: మకరంలో 3 గ్రహాలు - ఈ 3 రాశులవారికి ఊహించనంత ప్రయోజనం!
ధనుంజయము
పదో వాయువు ధనుంజయము. సాధారణంగా ప్రాణం పోయిన తర్వాత శరీరం దహనం అయ్యేవరకూ ఉండే వాయువు ధనుంజయము. అయితే మనిషి మృతి చెందిన తర్వాత కూడా కొన్ని గంటల పాటూ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ సమయంలో సహకరించే వాయువే ధనుంజయము. అందుకే ఎవరైనా చనిపోయిన తర్వాత వారి గుండెను వేరొకరికి మార్పిడి చేసే వీలుంటుంది.
5 పంచ ప్రాణాలు
1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం, 5. వ్యానం
5 ఉపప్రాణాలు
1.వ్యానము 2. నాగము ౩. కూర్మము 4.క్రుకరము 5. ధనుంజయము
మొత్తంగా పంచ ప్రాణాలు ఐదు....ఉప ప్రాణాలు ఐదు....ఈ పదింటిని కలరి దశవాయువులు అంటారు..శరీరాన్ని మొత్తం నడిపించేవి ఇవే...
Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!