అన్వేషించండి

Horoscope 27th January : ఈ రాశులవారిపై లక్ష్మీ అనుగ్రహం, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం- జనవరి 27 రాశిఫలాలు

Horoscope Today 27th January 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 27th January  2024  - జనవరి 27 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 

కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి..మాట తూలొద్దు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అదనపు పని బాధ్యతలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలుంటాయి. ఆర్థికంగా ఉపశమనం పొందుతారు. మీ ఖర్చుల విషయంలో మరోసారి ఆలోచించుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పని ఒత్తిడి తగ్గించుకోవడం మంచిది. 

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. బంధువులతో మీకున్న వివాదాలు తొలగిపోతాయి. అవివాహితుల పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి జీవితంలో సహనం అవసరం. ఆఫీసులో మీ వినూత్న ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. ఈ రోజు ఆర్థిక సంబంధిత విషాలు కలిసొస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.  

Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!

మిథున రాశి (Gemini Horoscope Today) 

మీ భాగస్వామి భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండండి. సంబంధాలలో అపార్థాలు పెరగనివ్వవద్దు. వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్ల నుంచి ఉపశమనం పొందుతారు. కొందరికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.కొంతమంది పని నిమిత్తం ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి, అయితే అధిక ఖర్చుల వల్ల మనస్సు కూడా కలత చెందుతుంది. పెట్టుబడి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుని డబ్బు ఆదా చేస్తారు 

కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు.విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు.  ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి.

సింహ రాశి (Leo Horoscope Today)

చేపట్టిన పనిలో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు కార్యాలయంలో అదనపు బాధ్యతలను పొందుతారు. ప్రేమ జీవితంలో కొత్త మలుపులు ఉంటాయి.  మీ భాగస్వామికి సమయం కేటాయించాలి. వ్యాపార సంబంధిత నిర్ణయాలు రెండుమూడుసార్లు ఆలోచించి తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులుంటాయి..అందుకే ఆర్థకి సంబంధిత నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ రోజు స్నేహితుల సహాయంతో పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 

Also Read: మకరంలో 3 గ్రహాలు - ఈ 3 రాశులవారికి ఊహించనంత ప్రయోజనం!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 

ఈ రోజు మీకు చాలా శుభదినం. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్త అందుకోవచ్చు.  తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. కొంతమంది ఈరోజు పాత స్నేహితులను కలుసుకుంటారు.

తులా రాశి (Libra Horoscope Today) 

మీరు వృత్తి జీవితంలో విజయం సాధిస్తారు. మాటలో మాధుర్యం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 

 

Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

అకౌంటింగ్, మేధోపరమైన పని నుంచి ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం ఊహించనంతగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. ఏదో తెలియని భ్రమ వల్ల మనసు కలత చెందుతుంది. కుటుంబంలో సంతోషానికి భంగం వాటిల్లుతుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

మిమ్మల్ని వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి జీవితంలో పురోగతి ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. చేపట్టిన పనిలో ఆంటకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. ఉద్యోగులు కొత్త ప్రతిపాదనలు పొందే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. వాహన నిర్వహణ కోసం ఖర్చులు చేయాల్సి రావొచ్చు. 

మకర రాశి (Capricorn Horoscope Today) 

వృత్తి జీవితంలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. పని బాధ్యతలు పెరుగుతాయి. డబ్బు విషయంలో ఈరోజు మీ పరిస్థితి బాగా లేదు. పెట్టుబడి నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి. ఖర్ఛులు చేసేముందు అవి ఎంతవరకూ అవసరమో ఆలోచించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి.

Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

కుటుంబ జీవితం బావుంటుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితేనే విజయం సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడవద్దు. వృత్తి జీవితంలో కొత్త ప్రాజెక్ట్‌ల బాధ్యత తీసుకోవడానికి ఆసక్తి చూపండి. ఇది పురోగతికి కొత్త అవకాశాలను అందిస్తుంది  . ఆర్థిక సంబంధిత విషయాల్లో కొన్ని ఒడిదొడుకులు ఉండొచ్చు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించండి. 

మీన రాశి (Pisces Horoscope Today) 

ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి సమయం. అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు నియంత్రించాలి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి.

గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget