అన్వేషించండి

Maha Shivaratri 2024: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!

జీవకోటికి ఆధారం పంచభూతాలు. వీటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత దేవాలయాలు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

Pancha Bhoota Linga Temples:  సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు పంచభూతాలు సైతం తానే అంటాడు. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు..వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

ఆకాశలింగం-చిదంబరం ( తమిళనాడు)

చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం
భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు
దీనిని సూచిస్తూ మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే కనిపిస్తుంది. అంటే నిరాకారుడుగా ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ పూజలు అందుకుంటాడు. శంకరుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే  నటరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. చిదంబర క్షేత్రం చెన్నై నుంచి  229 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!

పృథ్వి లింగం-కంచి  ( తమిళనాడు)

పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఓ సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా  అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు. ఈ క్షేత్రం చెన్నై నుంచి  72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!
 
వాయులింగం- శ్రీకాళహస్తి  ( ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం.   ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే. కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి. దీంతో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి. విజయవాడకు 377 కిలోమీటర్ల దూరంలో...తిరుపతి నుంచి దాదాపు 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటారు. 

Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు

జలలింగం- జంబుకేశ్వరం ( తమిళనాడు)

తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి. అందుకే  జంబుకేశ్వరం  అని పేరొచ్చిందని చెబుతారు. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. పానపట్టంపై . 
కప్పిన ఓ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు తీసి నీళ్లు పిండి మళ్లీ వేస్తుంటారు. చెన్నై నుంచి 331 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం.

Also Read: ఈ రాశివారి మేధో సామర్థ్యం అద్భుతం, జనవరి 25 రాశిఫలాలు

అగ్నిలింగం-అరుణాచలం ( తమిళనాడు)

కొండ మీద వెలిసే దేవుడిని దర్శించుకుని ఉంటారు..కానీ ఏకంగా దేవుడే కొండరూపంలో వెలసిన క్షేత్రం అరుణాచలం. ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. చెన్నై నుంచి  185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం. 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs RCB Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై  6వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamMI vs LSG Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 54పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం | ABP DesamDC vs RCB Match Preview IPL 2025 | ఈరోజు డీసీ, ఆర్సీబీ జట్ల మధ్య హోరా హోరీ పోరు | ABP DesamMI vs LSG Match Preview IPL 2025 | వాంఖడేలో ముంబైని ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
KCR On Fire: తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా?  కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
తులం బంగారం ఏమైంది! పింఛన్ రూ.4 వేలు ఇస్తున్నారా? కాంగ్రెస్ హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం
IPL 2025 RCB VS DC Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
టాప్ లేపిన ఆర్సీబీ.. సీజ‌న్ లో ఏడో విక్ట‌రీ నమోదు.. ఫిఫ్టీల‌తో రాణించిన కోహ్లీ, క్రునాల్, చేతులెత్తేసిన ఢిల్లీ
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
శ్రీవారి భక్తులకు అలర్ట్, మే 1 నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఇది తెలుసుకోండి
Crime News: ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
ఏపీలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
IPL 2025 MI VS LSG Resutl Update: ముంబై సిక్స‌ర్,  MI వ‌రుస‌గా ఐదో విక్ట‌రీ.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, బుమ్రా, ల‌క్నో ఘోర ప‌రాజ‌యం
ముంబై సిక్స‌ర్, MI వ‌రుస‌గా ఐదో విక్ట‌రీ.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, బుమ్రా, ల‌క్నో ఘోర ప‌రాజ‌యం
Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్
Pahalgam Terror Attack: వారికి జైలుశిక్ష, జరిమానా - పాక్ జాతీయులకు భారత్ మరో బిగ్ షాక్
వారికి జైలుశిక్ష, జరిమానా - పాక్ జాతీయులకు భారత్ మరో బిగ్ షాక్
Embed widget