అన్వేషించండి

Surya Grahan 2026 Date: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న! ఏ రాశులవారు చూడకూడదు, 'అగ్ని వలయం' ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి

Surya Grahan 2026: 2026లో రెండవ కంకణాకార సూర్యగ్రహణం ఆగష్టు 12న కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం సూతకాలం, భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి

Solar Eclipse : 2026 సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు..వాటిలో మొదటిది ఫిబ్రవరి 17న సంభవించింది. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవిస్తుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణం, దీనిని 'రింగ్ ఆఫ్ ఫైర్' అని కూడా పిలుస్తారు. ఈ సూర్యగ్రహణం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది.

సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక ప్రత్యేకమైన సంఘటనగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది ఆకాశంలో జరిగే అద్భుత దృశ్యాన్ని చూసి, నమోదు చేసే అవకాశాన్ని వారికి అందిస్తుంది. మరోవైపు, హిందూ మతంలో సూర్యగ్రహణాన్ని అశుభమైనదిగా  ఆరోగ్యానికి హానికరం అని భావిస్తారు. అందువల్ల, సూర్యగ్రహణం సూతకాలం ప్రారంభమైన వెంటనే, అనేక కార్యకలాపాలు నిషేధితమవుతాయి. కొన్ని పనులకు దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుందో తెలుసుకుందాం.

చంద్ర గ్రహణం రోజున ఆహార పదార్థాలపై దర్భ గడ్డిని ఎందుకు పెడతారు?

సూర్యగ్రహణం 2026 తేదీ సమయం

భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. గ్రహణం పాక్షిక దశ రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం ప్రధాన దశ 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉంటుంది. అందువల్ల, ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తారు.

ఈ సంవత్సరపు రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?

సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దానిని ఇక్కడ చూడటం అసాధ్యం, గ్రహణం  సూతకాలం ఇక్కడ వర్తించదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహణం కనిపించని ప్రదేశాల్లో కూడా సూతకాలం వర్తించదు. అందువల్ల, ఆగష్టు 12వ తేదీ శ్రావణ  అమావాస్య నాడు, పూజ, స్నానం, దానాలు ,నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించవచ్చు.

ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

ఆగస్టు 12న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల, భారతీయులు ఆకాశంలో అగ్నివలయం అనే అరుదైన దృశ్యాన్ని వీక్షించలేరు. అయితే, నాసా ఈ గ్రహణాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. మీరు ఈ గ్రహణాన్ని ఆన్‌లైన్‌లో చూడవచ్చు. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, స్పెయిన్ , ఆర్కిటిక్ ప్రాంతంలోని దేశాలలో కనిపిస్తుంది.

 గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం రెండుసార్లు చేయాలా? గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి?

ఏ రాశిలో , ఏ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 ఆగస్టు 12న కర్కాటక రాశిలో , ఆశ్లేష నక్షత్రంలో సూర్యగ్రహణం సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో, దీనిని దేశాన్ని  ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక ప్రధాన సంఘటనగా పరిగణిస్తున్నారు. చంద్రుని రాశిలో సూర్యగ్రహణం - కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు సూచికగా పరిగణిస్తారు. అందువల్ల, గ్రహణం యొక్క ప్రభావాలు ప్రధానంగా ఒక వ్యక్తి మానసిక స్థితిపై పడతాయి. ఆశ్లేష నక్షత్రానికి బుధుడు  అధిపతి. అందువల్ల, ఈ గ్రహణం మేధస్సు, వ్యాపారం , సమాచార ప్రసారం వంటి రంగాలలో పెద్ద మార్పులు లేదా పెను మార్పులను సూచిస్తుంది.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Dhanteras Wishes 2026: శ్రీ మహాలక్ష్మి ధన్వంతరి శ్లోకాలతో ధన త్రయోదశి శుభాకాంక్షలు తెలియజేయండి!
2026 నవంబర్ 06 శుక్రవారం ధన త్రయోదశి! శ్రీ మహాలక్ష్మి శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి!
Ramayana: రావణుడిని రావణబ్రహ్మ అని ఎందుకంటారు? అసలు రహస్యం ఇదే!
రావణుడిని రావణబ్రహ్మ అని ఎందుకంటారు? అసలు రహస్యం ఇదే!
నవంబర్ 12 నుంచి రాహుల్ గాంధీని కొత్తగా చూడబోతున్నామా? ఆయన జాతకం ఏం చెబుతోంది! 
నవంబర్ 12 నుంచి రాహుల్ గాంధీని కొత్తగా చూడబోతున్నామా? ఆయన జాతకం ఏం చెబుతోంది! 
దీపావళి వారం (నవంబర్ 5-11) రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనంలో ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం!
దీపావళి వారం (నవంబర్ 5-11) రాశిఫలాలు: తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనంలో ఈ 4 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!
Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026: ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Embed widget