Lunar Eclipse 2025: గ్రహణం పట్టు స్నానం, విడుపు స్నానం రెండుసార్లు చేయాలా? గ్రహణ సమయంలో ఏ నియమాలు పాటించాలి?
Ritual baths before and after: సెప్టెంబర్ 07 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ సమయంలో ఏ నియమాలు పాటించాలి..పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Chandra Grahan 2025: పూర్తిస్థాయిలో నియమాలు అనుసరించేవారంతా గ్రహణం ప్రారంభం అవగానే స్నానం ( పట్టు స్నానం)...గ్రహణం పూర్తయ్యాక స్నానం ( విడుపు స్నానం) చేస్తారు. అయితే పట్టు స్నానం చేసినా చేయకున్నా..విడుపు స్నానం తప్పనిసరిగా చేయాలి
అర్థరాత్రి గ్రహణం పరిసమాప్తం అవుతోంది.. ఈ సమయంలో విడుపు స్నానం చేయాలా?
వాస్తవానికి గ్రహణం ముగిసిన వెంటనే విడుపు స్నానం ఆచరిస్తారు. అయితే అర్థరాత్రి సమయంలో గ్రహణం వీడుతోంది కాబట్టి.. కేవలం జపం, ధ్యాన సాధనలో ఉన్నవారు మాత్రమే విడుపు స్నానం చేస్తారు. మిగిలినవారంతా ప్రశాంతంగా నిద్రపోయి..తెల్లవారి లేవగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా వెళ్లి స్నానం ఆచరించాలి. రాత్రి వేసుకున్న దుస్తులును తప్పనిసరిగా తడిపేయాలి.
గ్రహణ సమయంలో నియమాలు ఏం పాటించాలి?
ఆధ్యాత్మిన సాధనలో ఉండేవారు గ్రహణ సమయంలో ధ్యానం చేయాలి
నిద్రపోయేవారు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు
గ్రహణం విడుపు స్నానం ఆచరించాలంటూ వృద్ధులను, చిన్నారులను అర్థరాత్రి సమయంలో ఇబ్బందిపెట్టొద్దు. వేకువజామునే స్నానం ఆచరిస్తే సరిపోతుంది
దర్భలు అందుబాటులో ఉంటే..ఇంట్లో అన్ని ప్రదేశాల్లో , నీళ్లు, సరుకులపై వేయండి.. తద్వారా గ్రహణ కాంతి పడినా ఎలాంటి చెడు ప్రభావం ఉండదని చెబుతారు
వండిన ఆహారాన్ని దాచిపెట్టుకుని గ్రహణం తర్వాత తినకూడదు..గ్రహణం ప్రారంభానికి ముందే ఆహారాన్ని పూర్తిచేయండి, ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి ఇచ్చేయండి. గ్రహణం సమయానికి ముందు వండిన ఆహారాన్ని గ్రహణం తర్వాత తినకూడదు.
అర్థరాత్రి గ్రహణం ముగియడంతో వేకువ జామునే నిద్రలేచి.. స్నానం ఆచరించి.. ఇల్లంతా శుద్ధి చేయాలి. దేవుడి మందిరాన్ని కూడా శుభ్రం చేసి ... దేవుడి ఫొటోలన్నీ శుభ్రం చేసుకుని దీపం వెలిగించాలి. ఆ తర్వాతే ఆహార ఏర్పాట్లు చేసుకోవాలి.
టైమింగ్స్ ఇవే
సంపూర్ణచంద్రగ్రహణం స్పర్శకాలము రాత్రి 9 గంటల 56 నిముషాలు, నిమీలకాలము రాత్రి 10 గంటల 59 నిముషాలు, మధ్యకాలము రాత్రి 11 గంటల 41 నిముషాలు, ఉన్మీలకాలం రాత్రి 12 గంటల 22 నిముషాలు, మోక్షకాలం రాత్రి 1 గంట 26నిముషాలు. సంపూర్ణ చంద్రగ్రహణం పుణ్యకాలం మొత్తం 3 గంటల 30 నిముషాలు...బింబదర్శనకాలం 1 గంట 23 నిముషాలు
సంపూర్ణ చంద్ర గ్రహణం శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవిస్తోంది. అందుకే శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రం వారు... కుంభరాశివారు ఈ గ్రహణం చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర పండితులు స్పష్టం చశారు.
Lunar Eclipse 2025: సెప్టెంబరు 7న సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
రాజకీయ, ఆరోగ్య, ఆర్థిక సంక్షోభ సూచనలు! చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
September 9 number mystery: 'డబుల్ 9 శక్తి'తో నిండిన సెప్టెంబర్ 2025 ! ఈ నెలలో శుభ అశుభ ప్రభావాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.






















