Lunar Eclipse 2025: ఈ రోజే సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు?
Chandra Grahan: సెప్టెంబర్ 07న సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ రోజు గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశులవారు గ్రహణం చూడకూడదో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Chandra Grahan 2025 : 2025 - 2026 తెలుగు సంవత్సరంలో భూ మండలం మొత్తంమీద 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అవి 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు.
భారతదేశంలో రెండు చంద్రగ్రహణాలు కనిపిస్తాయి...2 సూర్య గ్రహణాలు మనదేశంలో కనిపించవు.
కనిపించే గ్రహణాలకు మాత్రమే సూతకాలం వర్తిస్తుంది. మనదేశంలో కనిపించని గ్రహణాలకు హడావుడి అవసరం లేదు...సూతకాలం పాటించాల్సిన అవసరమూ లేదు.
సోషల్ మీడియా, మీడియాలో గ్రహణాల గురించి తెగ హడావుడి జరుగుతోంది. ఎక్కడ గ్రహణం ఏర్పడినా అనవసర చర్చ జరుగుతోంది. అందుకే పండితులు స్పష్టంగా చెబుతున్నారు..మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే సూతకాలం వర్తిస్తుంది. మీడియాలో జరిగే ప్రచారాన్ని చూసి అనవసర చాదస్తాలకుపోవద్దు. సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు.
ఈ ఏడాది ఏర్పడనున్న 2 చంద్ర గ్రహణాల్లో మొదటిది 2025 సెప్టెంబర్ 07 ఆదివారం పౌర్ణమి రోజు ఏర్పడుతోంది
తేది: 7-9-2025తేది భాద్రపద శుక్లపూర్ణిను ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణచంద్రగ్రహణం. ఈగ్రహణం భారతదేశమంతటా కనిపిస్తుంది
సంపూర్ణచంద్రగ్రహణం
స్పర్శకాలము రాత్రి 9.56
నిమీలకాలము రాత్రి 10.59
మధ్యకాలము రాత్రి 11.41
ఉన్మీలకాలం రాత్రి 12.22
మోక్షకాలము రాత్రి 1.26
సంపూర్ణచంద్రగ్రహణం పుణ్యకాలం 3 గంటల 30 నిముషాలు
బింబదర్శనకాలం 1 గంట 23 నిముషాలు
ఉత్తరగోళం, అపసవ్యగ్రహణం, రాహుగ్రస్తం, పింగళవర్ణం, తూర్పు ఈశాన్యంలో స్పర్శ, తూర్పు ఆగ్నేయంలో నిమీలనం, దక్షిణ నైఋతిలో ఉన్మీలనం, పశ్చిమ నైఋతి పశ్చిమాసన్నముతో గ్రహణం ముగుస్తుంది. ఇవన్నీ గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి మోక్షం వరకూ దశలు.
సంపూర్ణ చంద్ర గ్రహణం ఎవరు చూడకూడదు?
ఈ గ్రహణం శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రంలో సంభవించుట వలన శతభిషం, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు, కుంభరాశివారు ఈగ్రహణం చూడరాదు.
నిత్యభోజన ప్రత్యాబ్దిక నిర్ణయం
పూర్ణిమకు సంబంధించిన పితృదేవతలను స్మరించుకునేవారు సెప్టెంబర్ 07 మధ్యాహ్నం 1.30 లోపు పూర్తిచేయాలి. ఈ రోజు రాత్రి భోజనం చేయరాదు.
గర్భిణీస్త్రీలు
యధావిధిగా ప్రశాంతంగా నిద్రపోవాలి..ప్రత్యేక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు
దేవాలయాలు
ఏ ఆగమశాస్త్ర గ్రంథాల్లో దేవాలయాలు మూసి వేయాలని చెప్పలేదు. కాని ఆచారంగా సాంప్రదాయంగా వస్తున్నందున గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేసి మళ్లీ శుద్ధిచేసి పూజలు చేసి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
స్పర్శ, మోక్ష కాలమును బట్టి 12 రాశుల వారి గ్రహణ ఫలములు
మేష రాశి - ధనలాభం
వృషభ రాశి - వ్యధ
మిథున రాశి - చింత
కర్కాటక రాశి - సౌఖ్యం
సింహ రాశి- స్త్రీ కష్టం
కన్యా రాశి -అతికష్టం
తులా రాశి - మాననాశనం
వృశ్చిక రాశి- సుఖం
ధనుస్సు రాశి -లాభం
మకర రాశి- వ్యయం
కుంభ రాశి - ఘాతం
మీన రాశి – హాని
ఈ రాశులవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
మేషం & వృషభం: ఓర్పు , మాట్లాడేటప్పుడు సహనం అవసరం
కర్కాటకం & సింహం: ఆరోగ్యం , కుటుంబ సామరస్యంపై దృష్టి పెట్టండి.
కన్యా & తుల: కెరీర్ పై శ్రద్ధ అవసరం, అనవసరమైన విభేదాలను నివారించండి.
వృశ్చికం & కుంభం: అంతర్గత ఆలోచన అవసరం
మీనం: ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి, అధిక ఖర్చులు తగ్గించండి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.





















