అన్వేషించండి
కొత్త బైక్, కొత్త కారు, బంగారం... సెప్టెంబర్ 07 to సెప్టెంబర్ 21 వరకు కొనుగోలు చేయకూడదు! ఎందుకంటే?
Pitru paksha 2025 : సెప్టెంబర్ 7న పితృ పక్షం ప్రారంభమైంది. ఈ 15 రోజులు కొన్ని వస్తువులు కొనడం అశుభంగా భావిస్తారు.
Pitru Paksha 2025
1/7

పితృ పక్షంలోని 15 రోజులు పితృదేవతలకోసం తర్పణం , పిండ ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 7 న ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది.
2/7

ఈ 15 రోజులలో చాలా నియమాలను పాటించాలి. అలాగే, ఈ సమయంలో కొన్ని వస్తువులను కొనడం కూడా అశుభంగా పరిగణిస్తారు.
3/7

ఆస్తి కొత్త ఆస్తి, ఫ్లాట్లు, భూమి లేదా దుకాణాలు మొదలైనవి కొనడం పితృ పక్షంలో మంచిదికాదంటారు. ఈ సమయంలో కొనుగోలు చేసిన ఈ వస్తువుల వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని నమ్మకం.ఈ సమయంలో కొత్త వాహనం కూడా కొనుగోలు చేయకూడదు
4/7

ఆభరణాలు పితృ పక్షంలో బంగారం, వెండి ఆభరణాలు కొనకూడదు. అలా చేయడం వల్ల పితృదేవతలు కోపగిస్తారట. ఈ 15 రోజుల్లో నూతన వస్త్రాలు కూడా కొనుగోలు చేయకూడదని చెబుతారు
5/7

కొత్త పాత్రలు పితృ పక్షం 15 రోజులలో ఇంటి కోసం కొత్త పాత్రలు కొనకూడదు. శ్రాద్ధ కర్మల కోసం మీరు ఇంటి పాత పాత్రలు లేదా ఆకులను ఉపయోగించవచ్చు.
6/7

ఎలక్ట్రానిక్స్ సామాన్లు ఫ్రిజ్ కంప్యూటర్ యంత్రాలు మొదలైనవి కొనడం కూడా పితృ పక్షంలో అశుభం. ఈ సమయంలో మీరు భోగ విలాసాలకు సంబంధించిన వస్తువులను కొనకపోవడమే మంచిది.
7/7

వంట సామాగ్రి: పితృ పక్ష సమయంలో వంటగదికి సంబంధించిన కొన్ని వస్తువులను అంటే ఆవాల నూనె, చీపురు , ఉప్పు కొనకూడదు. దీనివల్ల త్రిదోషం కలుగుతుందని, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు.
Published at : 07 Sep 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















