అన్వేషించండి

Chanakya Niti In Telugu: ఆ 6 విషయాల్లో నిజం ఎప్పటికీ చెప్పరు! ప్రతి భార్య భర్త దగ్గర దాచే విషయాలు!

Chanakya Neeti: ఎంత అన్యోన్యంగా ఉన్నానని చెప్పే జంట మధ్య అయినా కొన్ని దాపరికాలు ఉంటాయన్నది చాణక్యుడి భావన. ముఖ్యంగా ఆరు విషయాల్లో... అవేంటి? ఎందుకు? చాణక్యుడు ఏం చెప్పారు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భార్యలు భర్తలతో పంచుకోని ఆరు రహస్యాలు బంధాన్ని పటిష్టం చేస్తాయి.
  • భార్యలు తమ రహస్య క్రష్‌ను, నచ్చని నిర్ణయాలను భర్తకు చెప్పరు.
  • శృంగారం తర్వాత తమ అసంతృప్తిని, ఆర్థిక పొదుపును దాచిపెడతారు.
  • అనారోగ్యాన్ని, అభిప్రాయ భేదాలను మూడో వ్యక్తితో చర్చించి దాచేస్తారు.

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి బోధనలు నాటి తరానికే కాదు తర్వాత తరాలు కూడా అనుసరించేలా ఉంటాయి. రాజనీతి, పాలన, ఆర్థిక సంబంధిత అంశాలు మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం గురించి చాణక్యుడి బోధనలు చర్చనీయాంశమవుతాయి.  కుటుంబ సంబంధాలు, భార్య భర్తల బంధం గురించి కూడా సూటిగా తన భావాలు వ్యక్తం చేశారు ఆచార్య చాణక్యుడు. నీతిశాస్త్రంలో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయి.

దాంపత్య జీవితం గురించి, భార్య భర్త భావాలు, ఆలోచనలు, అబద్ధాల గురించి కొన్ని విషయాలు చెప్పారు చాణక్యుడు.  అన్నీ చెప్పేసుకుంటాం..తెరిచిన పుస్తకం, తెల్లకాగితం అని చెప్పేవారి మధ్య కూడా కొన్ని రహస్యాలు అలానే ఉండిపోతాయన్నారు. అయితే కొన్ని విషయాలు దాచిపెట్టినప్పుడే ఆ బంధం కలకాలం సాగుతుందని కూడా చెప్పారు చాణక్యుడు. ముఖ్యంగా ప్రతి భార్యా..తన భర్త దగ్గర దాచిపెట్టే ఆరు విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆచార్య చాణక్యుడు. ఇవి రహస్యంగా ఉన్నంతవరకే ఆ బంధం చెడిపోకుండా ఉంటుందని చాణక్యుడి భావన. భర్త దగ్గర భార్య దాచిపెట్టే రహస్యాలేంటంటే...

సీక్రెట్ రిలేషన్

ప్రతి పురుషుడికి, స్త్రీకి...తమ జీవితంలో ఏదో దశలో సీక్రెట్ క్రష్ ఉంటుంది. యవ్వనంలో అయినా, పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో సమస్యల నుంచి బయటపడేందుకు అయినా..ఇలా ఏదో దశలో ప్రతి స్త్రీకి ఓ సీక్రెట్ రిలేషన్ ఉంటుందంటారు చాణక్యుడు. ఈ విషయాన్ని ఏ భార్యా తన జీవిత భాగస్వామికి చెప్పాలని అనుకోదు. ప్రస్తావించే అవసరం, అవకాశం వచ్చినా కానీ బయటపెట్టేందుకు ఇష్టపడదు భార్య. ఈ విషయం రహస్యంగా ఉన్నంతవరకే దాంపత్యజీవితంలో సంతోషం ఉంటుందని చెబుతారు చాణక్యుడ

సరే అనేస్తే పోలా!

అనవసర వాదనలకు దిగేకన్నా సరే అనే రెండక్షరాలు ఎంత పెద్ద వాదనకు అయినా చెక్ పెట్టేస్తాయి. ఇందులో భాగంగా కొన్నిసార్లు తన భాగస్వామి తీసుకునే నిర్ణయాలు నచ్చకపోయినా కానీ ఎందుకొచ్చిందిలే అని సరే అనే మాట ముందుగా చెప్పేస్తుంది భార్య. మనసులో తనకు నచ్చకపోయినా బయటపెట్టదు. సరే అనకపోతే ఆ పని అవకపోగా..నిందమోయాల్సి వస్తుంది..అందుకే కొన్నిసార్లు ఈ పద్ధతే సరైనది అని చాణక్యుడి సూచన

శృంగారం తర్వాత మనసులో మాట చెప్పరు

కలయిక తర్వాత ఏ భార్యా తన భర్తకు నిజం చెప్పదన్నది చాణక్యుడి భావన. మగవారి కన్నా ఆడవారిలో రెట్టింపు కోర్కెలు ఉంటాయని చాణక్యనీతిలో ఉంది. అందుకే శృంగారంలో భర్త సంతృప్తి చెందినా భార్యకు ఆ భావన కలగదు అని..కానీ..ఆ విషయం చెప్పకుండా దాచేస్తారని ప్రస్తావించారు.

డబ్బు దాచడంలో అగ్రస్థానం

ఎంత సంపాదించాం అనేది కాదు ఎంత దాచిపెట్టాం అనేది ముఖ్యం. ఈ విషయంలో మగవారి కన్నా మహిళలు ముందుంటారంటారు చాణక్యుడు. సంపాదించేది భర్తే అయినా అందులో కొంత మొత్తాన్ని భర్తకు తెలియకుండా పొదుపుచేస్తారు భార్యామణులు. గృహలక్ష్మి అనే పదాన్ని అందుకే వినియోగిస్తాం. సమస్య వచ్చినప్పుడు ఆదుకునే బ్యాంక్ ఇది.

ఆరోగ్యం బాగాలేకపోయినా చెప్పరు

ఇంటిపనిలో అలసిపోయినా, ఆరోగ్యం బాలేకపోయినా ఆ విషయాన్ని భర్తకు చెప్పరు. తగ్గుతాయిలే అని నిత్యం తమపని తాము చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేకుండా సర్దుకుపోతారు.

మూడో వ్యక్తితో చర్చలు

భార్య భర్త మధ్య వచ్చే అభిప్రాయ బేధాలను మహిళలు మరొకరితో షేర్ చేసుకుంటారన్నది చాణక్యుడి భావన. తమ మనసులో మాట భర్తకు చెబితే ఏమనుకుంటారో, మరింత గొడవలు పెరుగుతాయేమో భావించి మూడో వ్యక్తితో చెబుతారు కానీ భర్త దగ్గర భావోద్వేగాలు దాచేసుకుంటారు. 
 
ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో ఈ రహస్యాలుంటాయ్..ఇవేం ప్రమాదకరం కాదు..వీటిపై ఆరాలు తీస్తే అప్పుడు బంధం బీటలువారే ప్రమాదం ఉంది. అందుకే ఎంత పారదర్శకంగా ఉన్నామని చెప్పే దంపతుల మధ్య అయినా కొన్ని రహస్యాలు ఉండడం తప్పేం కాదంటారు ఆచార్య చాణక్యుడు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Frequently Asked Questions

భార్యాభర్తల బంధం కలకాలం సాగాలంటే ఏం చేయాలి?

కొన్ని విషయాలను దాచిపెట్టినప్పుడే ఆ బంధం కలకాలం సాగుతుందని చాణక్యుడు చెప్పారు. ముఖ్యంగా భార్య తన భర్త దగ్గర దాచిపెట్టే ఆరు విషయాలు రహస్యంగా ఉంటే బంధం చెడిపోదు.

భార్యలు తమ భర్తల దగ్గర ఏ విషయాలను దాచిపెడతారు?

భార్యలు తమ సీక్రెట్ రిలేషన్, మనసులో లేకపోయినా 'సరే' అనడం, శృంగారం తర్వాత మనసులో మాట, డబ్బు దాచడం, ఆరోగ్యం బాలేకపోయినా చెప్పకపోవడం, మూడో వ్యక్తితో చర్చలు వంటివి దాచిపెడతారు.

శృంగారం తర్వాత భార్యలు తమ భర్తలకు తమ మనసులో మాట ఎందుకు చెప్పరు?

మగవారి కన్నా ఆడవారిలో కోర్కెలు ఎక్కువగా ఉంటాయని, భర్త సంతృప్తి చెందినప్పటికీ భార్యకు పూర్తి సంతృప్తి కలగకపోవచ్చని, అయితే ఆ విషయం చెప్పకుండా దాచేస్తారని చాణక్యుడు చెప్పారు.

ఆర్థిక విషయాల్లో మహిళలు ఎలా ఉంటారు?

ఎంత సంపాదించామనే దానికంటే ఎంత దాచిపెట్టామనేది ముఖ్యం. ఈ విషయంలో మహిళలు ముందుంటారు. భర్తకు తెలియకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు, ఇది సమస్య వచ్చినప్పుడు ఆదుకుంటుంది.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget