Chanakya Niti in Telugu: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
Chanakya Niti : ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, సొంత పార్టీలో అసంతృప్తులు.. ఇక ప్రత్యర్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాస్సిన అవసరమే లేదు. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తాయి?

Chanakya Niti in Telugu : రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా పాలన సాఫీగా సాగాలంటే ముందుగా ప్రభుత్వానికి , పాలకులకు తిరుగుబాటు దారులు ఉండకూడదు...ముఖ్యంగా సొంత రాజ్యంలో/ పార్టీలో అస్సలు వ్యతిరేకత ఉండకూడదు. కానీ ఇది సాధ్యమయ్యే పనేనా? దీనిపై ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు?
అందరి ఆశా సింహాసనం పైనే!
అప్పట్లో అయితే ప్రతి రాజ్యంలోనూ, ఇప్పుడైతే ప్రతి పార్టీలోనూ నమ్మక ద్రోహులు, తిరుగుబాటుదారులు, విశ్వాసఘాతకుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ల నిజస్వరూపం బయటపడుతుందంతే. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎప్పుడైతే పెరిగిపోతుందో సరైన పాలన అందించలేరు. చేపట్టే ప్రతి పనికి అడ్డంకులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో వ్యతిరేక వర్గాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆ పాలకులలో క్రూరత్వమే ప్రజలకు కనిపిస్తుంది. అలా ప్రజల్లోనూ వ్యతిరేక మొదలవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి వ్యతిరేకులు ఎంతమంది ఉంటారో..ప్రభుత్వంలో భాగంగా ఉండే వ్యతిరేకుల సంఖ్య కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఎందుకంటే అందరకీ సింహాసనం అధిష్టించాలనే కోర్కె ఉంటుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా చిన్న కుర్చీని వదిలి పెద్ద కుర్చీపై కూర్చోవాలనే ఆలోచన ఉంటుంది..ఇక ప్రత్యర్థుల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని కుట్రలు దాటి పరిపాలన సాగించాలంటే కత్తిమీద సామే...
Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!
అసలు తిరుగుబాటు ఎప్పడు మొదలవుతుంది!
రాజ్యంలో, ప్రభుత్వంలో, పార్టీలో..ఎక్కడైనా తిరుగుబాటుదారులు - అసంతృప్తులు ఎందుకుంటారంటే... ప్రజల్లో పాలకుల పట్ల అసంతృప్తి పెరిగిపోవడమే ప్రధాన కారణం. ప్రజల్లో దారిద్ర్యం పెరిగిపోయినప్పుడు పాలకులపై ప్రజలకు గౌరవం తగ్గిపోతుంది. ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడేందుకు కొన్ని కారణాలు స్పష్టంగా వివరించాడు ఆచార్య చాణక్యుడు...అవేంటంటే...
- మంచి వారిని విస్మరించి దుర్మార్గులతో స్నేహం చేయడం
- చెడు విధానాలను ప్రవేశపెట్టి ప్రజలకు హాని చేయడం
- ధర్మాన్ని విస్మరించి అధర్మానికి పెద్దపీట వేయడం
- నేరం చేసినవాడికి అండగా నిలవడం...నేరం చేయనివారికి శిక్ష విధించడం
- డబ్బు వృధా చేయడం - ప్రజలకు ఉపయోగపడే సంస్థలను నాశనం చేయడం
- దొంగలు, నేరస్తుల బారినుంచి ప్రజల్ని రక్షించకపోవడం సరికదా ప్రజల్ని తామే దోచుకోవడం
- విజ్ఞులను, జ్ఞానులను కించపరచడం
- తాము పొందుతున్న సేవలకు సరైన ప్రతిఫలం ఇవ్వకపోవడం
- ప్రజలకోసం ఏం చేస్తామని చెప్పారో ఆవేమీ పట్టించుకోకుండా వదిలేయడం
- అజ్ఞానం, నిర్లక్ష్యంతో ప్రజల శ్రేయస్సుని గాలికి వదిలేయడం
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...రాజు తన ఖర్చుదారి స్వభావంతో పూర్వీకుల ఆస్తిని నాశనం చేసినా... కోశాగారం మొత్తం తన స్వలాభం కోసం ఖాళీ చేసినా.. పిసినారి స్వభావంతో చేయాల్సిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా అది కూడా తన నాశనానికి కారణం అవుతుందని వివరించాడు చాణక్యుడు.
ఇవే ప్రభుత్వంపై, పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతాయి. ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వస్తే అది రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా... కౌంట్ డౌన్ మొదలైనట్టే.
Also Read: మే 4 వరూధిని ఏకాదశి, ఈ రోజుకున్న విశిష్టత ఏంటి ఏం చేయాలి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

