అన్వేషించండి

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

Mahabharat: ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో మహాభారత గమనం మారిపోయింది. మహాభారతంలో మహిళ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అందరకీ ద్రౌపది మొదటగా గుర్తొస్తుంది కానీ..మేం చెబుతున్నది ఆమె గురించి కాదు..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సత్యవతి, పడవ నడిపే దాసరాజు కుమార్తె, వ్యాసుడి తల్లి.
  • శంతన మహారాజును వివాహం చేసుకుని, భీష్ముడి ప్రతిజ్ఞతో రాజ్యానికి పునాది.
  • చిత్రాంగదుడు, విచిత్రవీర్యుల మరణానంతరం, వ్యాసుడితో నియోగ సంప్రదాయం ద్వారా సంతానం.
  • ధృతరాష్ట్ర, పాండు, విదురుల జననం మహాభారత కథకు కీలక మలుపు.

Mahabharat Hidden Facts In Telugu

ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో మహాభారత గమనం మారిపోయింది. మహాభారతంలో మహిళ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అందరకీ ద్రౌపది మొదటగా గుర్తొస్తుంది కానీ..మేం చెబుతున్నది ద్రౌపది గురించి కాదు..

సత్యవతి, యోజన గంధి, మత్స్య గంధి...ఈ పేర్లు గుర్తున్నాయా?

మహాభారత గమనాన్ని మార్చేసిన అతిముఖ్యమైన పాత్ర ఇది 

పడన నడిపే మత్సకార కుటుంబం నుంచి మహాసామ్రాజ్ఞి వరకూ..

మహాభారతం వెనుకున్న నిజమైన శక్తి సత్యవతి

ఎవరీ సత్యవతి?

దాసరాజు అనే మత్స్యకారుడు, పడవనడిపే వ్యక్తి కుమార్తె సత్యవతి. యమునా నదిలో పడవ నడుపుతుంటాడు దాసరాజు. తండ్రికి సహాయంగా ఉంటుంది సత్యవతి. ఓ రోజు పరాశర మహర్షి నదిని దాటేందుకు వస్తారు. దాసరాజు అప్పుడే భోజనానికి కూర్చోవడంతో కుమార్తెను పడవ నడపమని చెప్పి పంపిస్తాడు. నది మధ్యలోకి వెళ్లేసరికి సత్యవతి అందానికి మోహితుడవుతాడు పరాశర మహర్షి. వారిద్దరికీ జన్మించిన వ్యక్తే వ్యాస మహర్షి. ఆయనే అష్టాదశ పురాణాలు రచించిన వేద వ్యాసుడు. మహాభారతానికి మూలపురుషుడు. పుట్టగానే తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోతాజడు. అయితే.. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని తల్లికి మాటిస్తాడు. 

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

శంతనమహారాజుతో సత్యవతి వివాహం

పరాశర మహర్షి, వ్యాసుడు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తండ్రితో పాటూ పడవనడిపే పనిని కొనసాగిస్తుంది సత్యవతి.  ఓ రోజు వేటకు వచ్చిన శంతనమహారాజు సత్యవతిని చూసి వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పటికే శంతనమహర్షికి గంగాదేవితో వివాహం, అష్ట వసువుల జననం, వారిని నదిలో పడేయడం , ప్రశ్నించిన శంతనుడి చేతిలో ఆఖరి కుమారుడిని పెట్టేసి వెళ్లిపోవడం..ఇదీ కథ. ఆ కుమారుడే భీష్ముడు (శంతనుడు-గంగాదేవి- సత్యవతి-భీష్ముడు వీరి గురించి మహాభారతంలో ఏముందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి). శంతనుడికి-గంగకు జన్మించిన భీష్ముడికి కాకుండా.. తన కుమార్తె సత్యవతితో జన్మించిన సంతానానికి రాజ్యపాలన అప్పగించాలని షరతు విధిస్తాడు దాసరాజు. శంతనుడు సంకోచించినా తండ్రికోసం భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగా బాధ్యతలు తీసుకోను అని మాటిస్తాడు. అలా సత్యవతి-శంతనమహారాజు వివాహం జరుగుతుంది.

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడి జననం

శంతనుడు-సత్యవతికి... చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మిస్తారు. శంతనుడి మరణం తర్వాత చిత్రాంగదుడు సింహాసనం అధిష్టిస్తాడు. గంధర్వరాజులతో జరిగిన భీకరయుద్ధంలో ఈయన మరణించడంతో.. విచిత్రవీర్యుడు రాజ్యపాలన బాధ్యతలు చేపడతాడు. కాశీరాజు సంతానం అయిన అంబ, అంబాలికను వివాహం చేసుకుంటాడు. భోగాల్లో మునిగితేలి కొంతకాలానికి మరణించాడు విచిత్రవీర్యుడు. 

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

మహాభారత కథలో కీలక మలుపు

తనయులు ఇద్దరూ మరణించడంతో పాలనా బాధ్యతలు చేపట్టమని భీష్ముడిని అడుగుతుంది సత్యవతి. సవతి తల్లి మాటను నిరాకరించిన భీష్మడు తాను చేసిన ప్రతిజ్ఞను గుర్తుచేస్తాడు. అప్పుడిక తన మొదటి సంతానం అయిన వేద వ్యాసుడి గురించి చెబుతుంది సత్యవతి. తల్లి తలుచుకోగానే ప్రత్యక్షమైన వేదవ్యాసుడికి హస్తినాపుర భవిష్యత్ మొత్తం నీ చేతుల్లో ఉందని చెబుతుంది. 
 
నియోగ సంప్రదాయం ప్రకారం వంశాన్ని కొనసాగించమని తనయుడిని కోరుతుంది సత్యవతి. వ్యాసుడు మొదట సంకోచించినప్పటికీ, తన తల్లి ఆజ్ఞను పాటించడానికి , రాజ్య శ్రేయస్సు కోసం అంగీకరిస్తాడు. రాణి అంబికను మొదట వ్యాసుని వద్దకు పంపుతుంది సత్యవతి. వ్యాసుని కఠినమైన సన్యాసి రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది... ఫలితంగా ఆమెకు అంధుడు జన్మిస్తాడు..ఆయనే ధృతరాష్ట్రుడు. ఆందోళన చెందిన సత్యవతి..అంధుడైన రాజు సరిగా పాలించలేడని భావించి మరో కుమారుడి జననం అవసరం అని చెబుతుంది. అంబాలికను పంపగా..వ్యాసుడి రూపం చూసి అంబాలిక ముఖం పాలిపోవడంతో.. పాండు రాజు జన్మిస్తాడు. అంధపుత్రుడికి జన్మనిచ్చిన అంబికకు మరో సంతానం కావాలని కోరుకుంటుంది సత్యవతి. అయితే అంబిక బదులు దాసి వెళుతుంది. ప్రశాంత హృదయంతో వ్యాసుడిని స్వీకరించిన దాసికి జన్మించిన వాడే విదురుడు

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!
 
ధృతరాష్ట్రుడు బలవంతుడు
పాండురాజు గొప్ప యోధుడు 
విదురుడు రాజనీతి, ధర్మంపై తనకున్న జ్ఞానంతో ప్రసిద్ధి చెందాడు. 


Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

హస్తినాపురం భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమని సత్యవతి భావించింది.ఆ తర్వాత ధృతరాష్ట్రుడి సంతానం కౌరవులు, పాండురాజు సంతానం పాండవులు. అలా సత్యవతి నిర్ణయం, వ్యాసుడి జననం - పునరాగమనం...ముగ్గురి జననం మహాభారత కథకు మూలం అయ్యాయ్.  

Mahabharat Hidden Facts: ఒక్క నిర్ణయంతో మహాభారతాన్ని మార్చేసిన మహిళ | ద్రౌపది కాదు, సత్యవతి!

 సత్యవతి లేకపోతే?

మహాభారత కథలో సత్యవతి లేకపోతే.. భీష్ముడు రాజయ్యేవాడు, ధృతరాష్ట్రులు-పాండురాజు-విదురుడు జన్మించేవారే కాదు. పాండవులు కౌరవులు లేకపోతే మహాభారత యుద్ధం, భగవద్గీత లేనే లేదు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


 

Frequently Asked Questions

మహాభారత కథలో సత్యవతి ప్రాముఖ్యత ఏమిటి?

సత్యవతి అనే ఒకే ఒక్క నిర్ణయంతో మహాభారత గమనం మారిపోయింది. ఆమె మహాభారతానికి మూలపురుషురాలిగా పరిగణించబడుతుంది.

సత్యవతికి, పరాశర మహర్షికి సంబంధం ఏమిటి?

పరాశర మహర్షి నదిని దాటడానికి సత్యవతి పడవలో వెళుతున్నప్పుడు, ఆమె అందానికి మోహితుడై, ఆమె ద్వారా వ్యాస మహర్షికి జన్మనిచ్చాడు.

శంతన మహారాజు, సత్యవతి వివాహానికి భీష్ముడు ఎలా అంగీకరించాడు?

శంతన మహారాజు, సత్యవతికి జన్మించిన సంతానానికి రాజ్యపాలన అప్పగించాలని దాసరాజు షరతు పెట్టాడు. భీష్ముడు తన తండ్రి కోసం, తాను రాజుగా ఉండనని ప్రతిజ్ఞ చేశాడు.

సత్యవతి, వ్యాస మహర్షిల ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎలా జన్మించారు?

శంతనుడి సంతానం లేకపోవడంతో, సత్యవతి తనయుడు వేదవ్యాసుడి ద్వారా నియమ సంప్రదాయం ప్రకారం ధృతరాష్ట్రుడు (అంబిక), పాండురాజు (అంబాలిక) జన్మించారు.

సత్యవతి పాత్ర లేకపోతే మహాభారతం ఎలా ఉండేది?

సత్యవతి లేకపోతే, భీష్ముడు రాజయ్యేవాడు, ధృతరాష్ట్రులు, పాండురాజు, విదురుడు జన్మించేవారు కాదు. పాండవులు, కౌరవులు లేకపోతే మహాభారత యుద్ధం, భగవద్గీత కూడా ఉండేవి కాదు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget