Bhishma Ekadashi 2025 Date: ఈ రోజే ( ఫిబ్రవరి 08) భీష్మ ఏకాదశి ..ప్రాముఖ్యత ఏంటి - ఈ రోజు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏంటి!
Bhishma Ekadashi 2025 DateTithi Story: మాఘపౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువికి అత్యంత ప్రీతికరం. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతారు.

Significance Of Bhishma Ekadashi: భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని 'భీష్మ ఏకాదశి" అంటారు. అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీ కృష్ణుడిని చూసి ( ఆయనే పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని గుర్తించిన అతికొద్ది మందిలో భీష్ముడు ప్రధముడు) అమితానందంతో వేయినామాలతో కీర్తించాడు భీష్ముడు. అవే విష్ణుసహస్రనామాలు.
మహాభారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణుసహస్ర నామాలు పారాయణం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి.
పుట్టుక నుంచి నిర్యాణం వరకూ భీష్ముడి జీవితంలో ప్రతి మలుపూ ప్రత్యేకమే..
ఓ రోజు శంతన మహారాజు గంగా నదీ పరిసర ప్రాంతాల్లో విహరిస్తుండగా అక్కడో అందమైన కన్యను చూశాడు. పెళ్లిచేసుకోవాలని కోరగా ఆమె ఓ షరతు విధించింది. తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది. సరే అన్న శంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్లాడు. కొంతకాలానికి ఓ పుత్రుడిని కన్న ఆమె..గంగా గర్భంలో పడేసింది. అలా ఏడుగురు సంతానాన్ని గంగలో పడేసింది. ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన శంతనుడు..ఎనిమిదో బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడు. తన షరతుకి భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను శంతనుడి చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఆమె ఎవరో కాదు గంగా దేవి...నీటిలో పడిసేన ఏడుగురు బిడ్డలు అష్టమనువులు... వారిలో ఎనిమిదో వాడు - శంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
త్యాగానికి మారుపేరు
శీలం, శౌర్యం, నీతి, నిష్ఠ, త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు. తండ్రి కోసం సర్వసుఖాలను, రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు, భవిష్యత్ లో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రికోసం వివాహం వద్దనుకున్నాడు. తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు. అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ ఫుల్ అని చెబుతారు..
కోరుకున్న రోజే మరణం
అష్టమనువుల్లో ఒకడు, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగినవాడు, కురువృద్ధుడు, తెలివైనవాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. దక్షిణాయనంలో మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి చూసి 58 రోజుల పాటూ అంపశయ్యపై ఉండిపోయాడు. ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీ కృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామాలు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకి బోధించాడు. మహాభారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు...ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్ణ ఏకాదశిగా , మహా ఫల ఏకాదశిగా , జయ ఏకాదశిగా వర్ణించారు. సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే. భీష్మ ఏకాదశి పఠిస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి, సిరి సంపదలు కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి, గ్రహదోషాలు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు..
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
సాధారణంగా 15 రోజులకోసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది..భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యం, పుణ్యం రెండూ లభిస్తాయంటారు పండితులు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

