అన్వేషించండి

Bhagavad Gita: తపస్సు అంటే కళ్లు మూసుకుని అడవుల్లో ధ్యానం చేయడం కాదు! ఆధునిక కాలంలో తపస్సు అంటే ఏంటి? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు?

Srimad Bhagavad Gita:తపస్సు అనే మాట వినగానే పూర్వకాలం రుషులు, మునులు కళ్లుమూసుకుని అడవుల్లో రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవారని పెద్దలు చెబుతుంటారు. ఆధునిక కాలంలో తపస్సు అంటే ఏంటి?

Bhagavad Gita: తపస్సు అనే మాట వినగానే పూర్వకాలం రుషులు, మునులు కళ్లుమూసుకుని అడవుల్లో రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవారని పెద్దలు చెబుతుంటారు. పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది. మరి ఆధునిక కాలంలో తపస్సు అంటే ‌అలా సాధ్యమవుతుందా? జనజీవనం మధ్య ఉంటూనే తపస్సు ఆచరించడం ఎలా? సాధ్యమవుతుందా?  తపస్సు గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

భగవద్గీతలో శ్రీకృష్ణుడు తపస్సుని మూడు రకాలుగా విభజించాడు
 
శరీరం

వాక్కు

మానసికం

అంటే శరీరం, మనస్సు, మాట ద్వారా చేసే తపస్సు. 

గుణాల ఆధారంగా సాత్విక, రాజస, తామస అని చెప్పాడు

భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం
 
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥

దేవతలను, ద్విజులను, ప్రాజ్ఞులగు జ్ఞానులను పూజించటమే శారీరక తపస్సు. శుచి అయిన సానుకూల భావాలు (Positive and Optimistic Feelings) కలిగి ఉండటం. కుటిలత్వం లేకపోవటం. మనోవాక్కాయములతో ఒకే రీతి అయిన భావప్రకటనలు కలిగి ఉండటం . బ్రహ్మచర్యాన్ని   వ్రతదీక్షగా పాటించటం , అహింసకు దూరంగా ఉండడం...ఇదే శారీరక తపస్సు. ఈ తపస్సు శరీరాన్ని శుద్ధి చేసి ఆరోగ్యం, శక్తిని ఇస్తుంది

వాక్ తపస్సు ( మాట ద్వారా తపస్సు)

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥

ఉద్రేకం, భయం, ఆవేశం ఏర్పడకుండా మాట్లాడడం - నిజాలు మాత్రమే మాట్లాడడం - శాస్త్ర గ్రంథాలు పఠించడం - భగవంతుడిని ధ్యానించడం, వేదాభ్యాసం ఇవన్నీ వాక్ తపస్సులో భాగం

మానసిక తపస్సు

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥

మనస్సును పవిత్రంగా, దుష్టభావాలకు రహితంగా, దురభిప్రాయాలకు రహితంగా ఉంచుకోవటం -  ప్రాపంచిక విషయాల పట్లా , జీవితంలోని సర్వ సంఘటనలపట్ల ఉద్వేగరహితమైన మౌన పాటించడం , మంచి విషయాలను గ్రహించడం ఇదే మానసిక తపస్సు. ఇది మనస్సుని నియంత్రించి ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తుంది
 
రాజస తపస్సు 
 
సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ॥

గుర్తింపు కోసం, సల్పకాలిక ప్రయోజనాల కోసం చేస్తున్న శారీక, వాక్, మానసిక తపస్సులను రాజసిక తపస్సు అంటారు. ఇది అస్థిరమైన, చంచలమైన తాత్కాలిక ఫలితాలను ఇస్తుంది
 
తామస తపస్సు
 
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ॥
 
మూఢత్వంతో కూడిన పట్టుదల, జీవులను హింసించి, వారికి నష్టం కలగజేయాలన్న ఉద్దేశం, ఇతరులను వశం చేసుకోవాలి అనే ఆశయాలతో చేసే శారీరక , వాచిక, మానసిక తపస్సును తామస తపస్సు అంటారు. ఇది అత్యంత హానికరం
 
భగవద్గీత ప్రకారం తపస్సు అంటే కష్టపడడం కాదు. అది శరీరం, మాట, మనస్సుని శుద్ధి చేసుకోవడం. ఇంద్రియాలను నియంత్రించడం, సాత్విక తపస్సు మాత్రమే శాశ్వత శాంతినిస్తుంది, మోక్షానికి దారితీస్తుంది. రాజస, తామస తపస్సులు మంచి ఫలితాలను ఇవ్వవు పైగా హానిచేస్తాయి. భగవద్గీతలో ఇతర అధ్యాయాల్లోనూ తపస్సు గురించి ప్రస్తావన ఉంది. యజ్ఞం, తపస్సు, దానం ఇవన్నీ పుణ్యఫలాన్నిస్తాయి.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
ఢిల్లీ, ఉజ్జయిని, ముంబై , కోల్‌కతా, హైదరాబాద్.. ఒకే రోజు పంచాంగం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget