అన్వేషించండి

AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ

PV Narasimha Rao statue in AP: తెలంగాణ ప్రముఖులు పీవీ, చాకలి ఐలమ్మ, జయశంకర్ విగ్రహాలను ఏపీలో పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఏపీలోనూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

AP Telangana statue politics:  తెలంగాణ ప్రముఖుల విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారి విగ్రహాలను ఏపీలో కూడా ప్రతిష్టించాలని  ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలంగాణ థింకర్స్ ఫోరమ్ తో పాటు పలువురు తెలంగాణ వాదులు ఈ డిమాండ్లను సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు. 

ఈ ప్రతిపాదనలపై ఏపీలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.  ఏపీ  బీజేపీ సీనియర్ నేత యస్. విష్ణువర్ధన్ రెడ్డి  శనివారం విశాఖపట్నంలో ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదని, వారు తెలుగు వారందరి ఉమ్మడి ఆస్తి అని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు యస్. విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జన్మించినప్పటికీ.. పీవీ నరసింహారావు, చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు యావత్ తెలుగు సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. వారి విగ్రహాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని, దీనివల్ల తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం మరింత బలపడుతుందని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రాంతీయ విద్వేషాలను రాజేస్తోందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, నాయకత్వాన్ని కించపరిచేలా చేస్తున్న వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని ఖండించారు.  

రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా.. ఇంకా ప్రాంతీయ భావోద్వేగాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.  తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మహనీయుల గౌరవాన్ని రాజకీయ వివాదాలకు వాడుకోవడం సమాజానికి మంచిది కాదు  అని హెచ్చరించారు. తెలంగాణ మహనీయులను ఆంధ్ర ప్రజలు ఎలాగైతే గౌరవిస్తారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహనీయులను తెలంగాణ ప్రజలు కూడా గౌరవిస్తారని, ఈ సంప్రదాయం కొనసాగాలని ఆయన కోరారు.   

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ధర్మంతో ముందుకు సాగుతూ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని, పొరుగు రాష్ట్ర ప్రజలపై విషం చిమ్మడం ద్వారా తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో మొదలైన విగ్రహాల ఏర్పాటు డిమాండ్ ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. ఈ కారణంగా బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకోవడం ద్వారా విభేదాలను తొలగించవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
ABP Desam Top 10, 9 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 9 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget