అన్వేషించండి

Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు

Balka Suman Arrested: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్‌లో హైడ్రామా అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సింగరేణిని తగలబెట్టాలని, మిలిటెంట్ చర్యలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.
  • తెలంగాణ భవన్‌ కేంద్రంగా హైడ్రామా, పోలీసుల అరెస్టుతో ఉద్రిక్తతలు.
  • ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రేరేపించారంటూ కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు.
  • కక్ష సాధింపు చర్యలని, జైలుకు వెళ్లడం కొత్తకాదని అరెస్ట్ పై బాల్క సుమన్ స్పందన.

Balka Suman Arrested: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో తెలంగాణ భవన్‌ కేంద్రంగా హైడ్రామా సాగింది. తీవ్ర ఉద్రిక్తత మధ్య ఆయన్ని నాంపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సింగరేణిని తగలబెట్టాలని, మిలిటెంట్‌ యాక్టివిటీ చేయాలని చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై పలు స్టేషన్స్‌లో కేసులు నమోదు అయ్యాయి.  

సింగరేణి బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అరెస్టుకు దారి తీశాయి. సింగరేణిని తగులబెట్టండి... మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. డబ్బులు కావాలంటే ఆఫీస్‌లను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కామెంట్స్‌పై ఆనంద్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా 326(g), 351(3), 353(1)(b), r/w 61(2)(a), BNS4 PDPPA వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

మిలిటెంట్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరిగింది. దీంతో బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌నే తన ఆవాసంగా మార్చుకున్నారు. ఆయన బయటకు రాగానే అరెస్టు చేయాలని పోలీసులు వ్యూహం రచించారు. భవన్ వెలుపల భారీగా పోలీసులు మోహరించారు. లోపల బీఆర్‌ఎస్ కార్యకర్తలు, లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ గో బ్యాక్ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని బీఆర్‌ఎస్‌ లీగర్‌ సెల్‌ ప్రశ్నించగా, నాన్‌బెయిల్‌బుల్ కేసులు కాబట్టి నోటీసులు అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు. 

Image

అరెస్టుకు కొద్ది నిమిషాల ముందు బాల్క సుమన్ మీడియా ముందు తన గళాన్ని గట్టిగానే వినిపించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 250కిపైగా కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపి పైశాచికానందం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో వందల కోట్ల స్కాములు జరుగుతున్నాయని, వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆయన దుయ్యబట్టారు. 

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అత్యంత కఠినమైనవి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రేరేపించడం వంటి సెక్షన్ల వల్ల పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. బీఆర్‌ఎస్‌ లాయర్లు మాత్రం ఇవన్నీ అక్రమ కేసులని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.   

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

Frequently Asked Questions

బాల్క సుమన్‌ను ఎందుకు అరెస్టు చేశారు?

సింగరేణిని తగలబెట్టాలని, మిలిటెంట్‌ యాక్టివిటీ చేయాలని బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు రావడంతో నాంపల్లి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. దీనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

బాల్క సుమన్‌పై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు?

ఆనంద్‌ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా 326(g), 351(3), 353(1)(b), r/w 61(2)(a), BNS4 PDPPA వంటి కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

అరెస్టుకు ముందు బాల్క సుమన్‌ ఏమని ఆరోపించారు?

ప్రభుత్వం చేస్తున్న మోసాలను, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనను జైలుకు పంపాలని చూస్తున్నారని విమర్శించారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు ఎంతవరకు శిక్ష పడే అవకాశం ఉంది?

ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రేరేపించడం వంటి సెక్షన్ల వల్ల పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అయితే, బీఆర్‌ఎస్‌ లాయర్లు ఇవన్నీ అక్రమ కేసులని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget