అన్వేషించండి

Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

తెలంగాణ రిటైర్డ్‌ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ఆదేశాలతో 2000కోట్ల జీపీఎఫ్‌, కమ్యూటేషన్ బకాయిలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 2000 కోట్లు విడుదల చేసింది.
  • జీపీఎఫ్ బకాయిలు 100%, మే 2025 వరకు కమ్యుటేషన్ సెటిల్డ్.
  • మొత్తం రూ. 6000 కోట్ల బకాయిల్లో మొదటి విడతగా ఈ మొత్తం విడుదల.
  • హైకోర్టు ఆదేశాలు, ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం చర్యలు.

Telangana Employee Dues: తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లోకి నిధులు చేరనున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పదవి విరమణ బకాయిల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శుక్రవారం(మే29) రెండువేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేసిన రిటైర్‌ అయిన వేలాది మంది ఉద్యోగులకు అందాల్సిన జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, ఇతర ప్రయోజనాలు నిలిచిపోయాయి. తాజా ఉత్తర్వులతో జీపీఎఫ్‌ బకాయిలు 100శాతం క్లియర్ అయ్యాయి. అంతేకాకుండా, మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తిగా సెటిల్ చేసింది. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మే 2న ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో జరిపిన చర్చల ఫలితమే ఈ నిధుల విడుదల. ఆ సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం ఆరు వేల కోట్ల బకాయిలను వంద రోజుల్లోగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు మొదటి విడతగా ఈ భారీ మొత్తాన్ని విడుదల చేశారు. 

టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1

భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

2

వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?

3

నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

4

బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా?

5

6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన వంద రోజుల డెడ్‌లైన్‌ను గౌరవించడం ద్వారా తన విశ్వసనీయతను చాటుకోవాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా నేతృత్వంలో సరైన ఆర్థిక వ్యూహంతో ఈ నిధులను సర్దుబాటు చేశారు. 

ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసిన వెంటనే, ప్రాసెస్‌ ప్రారంభమైంది. రాబోయే కొద్ది రోజుల్లోనే రిటైర్డ్‌ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి ఈ సొమ్ము నేరుగా జమ కానుంది. మిగిలిన రూ. 4000 కోట్లను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బకాయిలను అంశం ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 

  • మొత్తం బకాయిలు- రూ. 6000 కోట్లు 
  • ప్రస్తుతం విడుదల చేసినవి- రూ. 2000 కోట్లు 
  • చెల్లింపు స్థితి- జీపీఎఫ్‌ బకాయిలు 100శాతం పూర్తి, మే 2025 వరకు కమ్యుటేషన్ సెటిల్డ్‌
  • మిగిలిన మొత్తం - 4000 కోట్ల రూపాయలు 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రిటైర్డ్ ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల నేతల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Frequently Asked Questions

తెలంగాణలో ఉద్యోగుల పదవీ విరమణ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?

తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రూ. 2000 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తంతో జీపీఎఫ్ బకాయిలు 100% క్లియర్ అయ్యాయి.

ఎంతకాలం పెండింగ్‌లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలను ప్రభుత్వం సెటిల్ చేసింది?

ప్రభుత్వం మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యుటేషన్ బకాయిలను పూర్తిగా సెటిల్ చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు అందనున్నాయి.

ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎంత సమయం పట్టగలదు?

ప్రభుత్వం మొత్తం ఆరు వేల కోట్ల బకాయిలను వంద రోజుల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మొదటి విడతగా రూ. 2000 కోట్లు విడుదల చేయగా, మిగిలిన రూ. 4000 కోట్లను కూడా నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని స్పష్టం చేసింది.

ఈ బకాయిల చెల్లింపునకు దారితీసిన పరిస్థితులు ఏమిటి?

పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగులు- 16న ఏపీ జేఏసీ అత్యవసర భేటీ 
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Adilabad Airport Update: ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
ఎయిర్ పోర్టు భూసేకరణ, సర్వే ప్రక్రియపై ప్రజలకు అపోహలు ఉండొద్దు- అధికారులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు 
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Embed widget