అన్వేషించండి

Telangana paddy cultivation reduction: తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!

Telangana Rice production:తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి సవాల్‌గా మారింది. గోదాముల్లో నిల్వలు పేరుకుపోతుండటం, ఇతర నిత్యావసర పంటల కొరత ఏర్పడుతూండటంతో పంటల మార్పిడికి కేంద్రం టార్గెట్ పెట్టింది.

Oil palm and pulses cultivation Telangana:   తెలంగాణ గడ్డపై పారుతున్న జలకళతో వరి సాగు రికార్డులు సృష్టిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి కళ్లెం వేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వరి సాగును తగ్గించి, ఆ స్థానంలో నూనెగింజలు, పప్పుధాన్యాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం భారీ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని నిర్ణయించగా, అందులో ఏకంగా 10 శాతం అంటే 25 లక్షల ఎకరాలు బాధ్యతను ఒక్క తెలంగాణకే అప్పగించడం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కలకలం రేపుతోంది.

 తెలంగాణపైనే ఎందుకు ఈ భారం?                        

గడిచిన మూడేళ్లలో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 16 లక్షల ఎకరాల మేర పెరిగి, ప్రస్తుతం 133 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. యాంత్రీకరణ పెరగడం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉండటంతో పాటు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 500 బోనస్  పథకం రైతులకు వరిపై మరింత మక్కువ పెంచింది. ఫలితంగా కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు నిండిపోయి, కొత్త పంటను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ  కారణంగానే ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున  వరిని తగ్గించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

 ధాన్యం ఎక్కువ.. పప్పులు తక్కువ!                      

రాష్ట్రంలో ఒకవైపు వరి నిల్వలు పేరుకుపోతుంటే, మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మన అవసరాలకు సరిపడా ఇవి ఇక్కడ ఉత్పత్తి కాకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే వరిని తగ్గించి, ఆ భూముల్లో ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు , వాణిజ్య పంటలు వేయడం ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించవచ్చని కేంద్రం సూచిస్తోంది.

 రైతులకు సవాల్‌గా మారనున్న పంటల మార్పిడి                 

అయితే, దశాబ్దాలుగా వరి సాగుకే అలవాటు పడిన రైతులకు ఇది పెద్ద పరీక్షగా మారనుంది. వరి పంటకు ఉన్న మార్కెటింగ్ సౌకర్యం, నీటి లభ్యత ఇతర పంటలకు ఉంటుందా? అన్నది రైతుల ప్రధాన సందేహం. కేవలం ఆదేశాలతోనే వరి సాగు తగ్గదని, ప్రత్యామ్నాయ పంటలకు గ్యారెంటీ ధర స కొనుగోలు భరోసా కల్పిస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన ఈ భారీ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరి తగ్గించి ఇతర పంటల వైపు రైతులను మళ్లించడం వల్ల మార్కెట్‌లో సమతుల్యత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులను ఒప్పించడం అంత సులభం కాకపోవచ్చు. ఏదేమైనా, తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు వరి  నీడ నుంచి బయటకు వచ్చి  వాణిజ్య బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Telangana High Court Order: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు - బాధితురాలి వివరాలున్న 200 సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశం!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget