అన్వేషించండి

Paddy cultivation in Andhra Pradesh: తెలంగాణలో రికార్డులు - ఏపీలో తగ్గిపోతున్న వరి దిగుబడి - ఎందుకిలా జరుగుతోంది?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వరి సాగు తగ్గిపోతోంది. దీనిపై పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రైతులు మార్పు కోరుకుని అభివృద్ధి చెందుతున్నారన్న గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి.

Paddy cultivation in Andhra Pradesh declining:   తెలంగాణ వరి సాగులో రికార్డులు సృష్టిస్తూ  భారతదేశ ధాన్యాగారంగా  అవతరిస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పదేళ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరగకపోగా స్వల్పంగా తగ్గింది. దీనిపై వివిధ వర్గాల్లో  ఆసక్తికర చర్చ నడుస్తోంది.  కానీ వరి సాగు పెరగడమే వ్యవసాయాభివృద్ధికి ఏకైక కొలమానం కాదు. ఏపీ రైతులు ఆహార భద్రత  నుంచి  ఆదాయ భద్రత వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. వరి కంటే అత్యధిక లాభాలనిచ్చే ఆక్వాకల్చర్ , ఉద్యానవన పంటల వైపు మళ్లడం వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ  లో వ్యవసాయ రంగం వాటా  30 శాతానికి పైగా  ఉందని గణాంకాలు చెబుతున్నాయి.  ఇదే సమయంలో తెలంగాణలో ఇది కేవలం 16 శాతంగానే  ఉంది. 

వరికి పెట్టుబడి ఎక్కువ .. ఆదాయం తక్కువ! 

వరి సాగులో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత,  మద్దతు ధరలో ఒడిదుడుకులు రైతుకు నికర లాభాన్ని తగ్గించేస్తున్నాయి. అందుకే ఏపీలోని కోస్తా తీర ప్రాంత రైతులు తెలివిగా వరి పొలాలను రొయ్యల చెరువులుగా మారుస్తున్నారు. ఫలితంగా, నేడు దేశం నుండే జరుగుతున్న రొయ్యల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో  నిలిచింది. ఒక ఎకరం వరిలో వచ్చే ఆదాయం కంటే, ఆక్వా రంగంలో మూడు నాలుగు రెట్లు అధిక లాభం పొందుతూ రైతులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటున్నారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా విభిన్న రంగాల్లో రాణించడం ఏపీ వ్యవసాయ రంగ పరిణతికి నిదర్శనంగా భావిస్తున్నారు. 

రాయలసీమలోనూ మారిన పంటల తీరు 

రాయలసీమ  మెట్ట ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే) పంటల కంటే ఎక్కువ విలువనిచ్చే  పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మిరప, వేరుశనగతో పాటు మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటల సాగులో ఏపీ నేడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందే ఈ పంటలు మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోగలవు. వరి సాగు విస్తీర్ణం పెరగకపోవడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, అది మారుతున్న కాలానుగుణంగా రైతులు ఎంచుకున్న లాభదాయక మార్గమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యతలు వేరు 

తెలంగాణ ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రాధాన్యతలు పూర్తిగా భిన్నమైనవి. తెలంగాణ భారీ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన భూముల్లో వరిని ప్రోత్సహిస్తుంటే, ఏపీ మాత్రం ఉన్న భూముల్లో గరిష్ట విలువను  సృష్టించడంపై దృష్టి పెట్టింది. పండిన పంటను నేరుగా అమ్మేయకుండా ప్రాసెసింగ్ ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడమే ఏపీ ప్రస్తుత వ్యూహం. దేశానికి అన్నం పెట్టే స్థాయిని కాపాడుకుంటూనే, రైతుల జేబుల్లో ఎక్కువ డబ్బు చేరాలనే లక్ష్యంతో ఏపీ రైతులు వాణిజ్య పంటల వైపు వెళ్లడం ఆర్థికంగా అత్యంత ఆరోగ్యకరమైన పరిణామం.

కేవలం వరి పండించడం మాత్రమే వ్యవసాయం కాదు. భూమిని, నీటిని సమర్థవంతంగా వాడుకుంటూ రైతుకు గరిష్ట ఆదాయాన్ని అందించే పంటలే నిజమైన ప్రగతికి సంకేతం. ఏపీ రైతులు పాత పద్ధతుల నుండి బయటపడి పారిశ్రామిక వ్యవసాయం వైపు మళ్లడం ద్వారా భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
TDP Janasena Seat Sharing: స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
స్థానిక పోరులో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - 7 కార్పొరేషన్లపై కన్ను.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
KCR Farmhouse 45 Acres Missing Land: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల మిస్సింగ్ భూమి కలకలం - నోటీసులు రెడీ..రాజకీయ భూకంపం తప్పదా?
Varanasi Update : 'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
'బాహుబలి'లో కిలికి భాష... 'వారణాసి'లో మరో సరికొత్త లాంగ్వేజ్ - రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Embed widget