ఈ వాహనాన్ని గుంతలను పూడ్చడానికి అత్యాధునిక జెట్ ప్యాచర్ సాంకేతికతతో రూపొందించారు.

Published by: Raja Sekhar Allu

రోడ్ డాక్టర్ వెహికల్ కేవలం 5 నుండి 10 నిమిషాల్లోనే ఒక గుంతను పూర్తిగా బాగు చేయగలదు.

Published by: Raja Sekhar Allu

ఒకేసారి క్లీనింగ్, ఎమల్షన్ స్ప్రేయింగ్, మెటీరియల్ ఫిల్లింగ్ , సీలింగ్ అనే నాలుగు పనులను వరుసక్రమంలో పూర్తి చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

దుమ్ము, ధూళిని హై-ప్రెజర్ ఎయిర్ జెట్ ద్వారా క్లీన్ చేస్తుంది. దీనివల్ల వేసే మెటీరియల్ రోడ్డుకు బలంగా అతుక్కుంటుంది.

Published by: Raja Sekhar Allu

ఈ వెహికల్ వాడి గుంత పూడ్చిన వెంటనే కేవలం 15-20 నిమిషాల్లోనే వాహనాల రాకపోకలను అనుమతించవచ్చు.

Published by: Raja Sekhar Allu

గతంలో పది మంది కార్మికులు చేసే పనిని ఈ ఒక్క వాహనం సులభంగా చేయగలదు.

Published by: Raja Sekhar Allu

తేలికపాటి వర్షం కురుస్తున్నప్పుడు కూడా ఈ వాహనంతో గుంతలను పూడ్చవచ్చు

Published by: Raja Sekhar Allu

రోడ్లను గుంతల రహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ వాహనాలను మొబైల్ యూనిట్లుగా వాడుతున్నారు.

Published by: Raja Sekhar Allu

ఈ వాహనం చాలా వేగంగా పని పూర్తి చేయడం వల్ల రహదారులపై ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం చాలా తక్కువ

Published by: Raja Sekhar Allu

ఈ యంత్రం ద్వారా చేసే ప్యాచ్ వర్క్ కనీసం 2 నుండి 3 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది

Published by: Raja Sekhar Allu