వైజాగ్ నుంచి వంజంగి సుమారు 100-110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

పాడేరుకు నిరంతరం ఆర్టీసీ బస్సులు ఉంటాయి. పాడేరు చేరుకున్నాక, అక్కడ నుండి ఆటోలు లేదా స్థానిక వాహనాల ద్వారా వంజంగి వ్యూ పాయింట్ వరకు వెళ్లవచ్చు.

Published by: Raja Sekhar Allu

వంజంగి కొండ పైకి వెళ్లడానికి సుమారు 5 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డులో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

తెల్లవారుజామున సూర్యోదయాన్ని చూడాలనుకునే వారు రాత్రి 2-3 గంటల సమయానికే ట్రెక్కింగ్ ప్రారంభించడం ఉత్తమం.

Published by: Raja Sekhar Allu

కొండ పై నుండి చూస్తే మేఘాలన్నీ ఒక సముద్రంలా అలలు అలలుగా కనిపిస్తాయి.

Published by: Raja Sekhar Allu

సముద్ర మట్టానికి సుమారు 3,400 అడుగుల ఎత్తులో ఉంది, దీనివల్ల ఏడాది పొడవునా చల్లని వాతావరణం ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

లంబసింగి తర్వాత ఆ స్థాయిలో చలి , మంచు ఉండే ప్రదేశం కావడంతో దీనిని కూడా ఆంధ్రా కాశ్మీర్‌గా పర్యాటకులు అభివర్ణిస్తారు.

Published by: Raja Sekhar Allu

సాహస ప్రియులకు ఇక్కడి 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ మార్గం మంచి థ్రిల్ ఇస్తుంది. తెల్లవారుజామున మంచులో కొండలు ఎక్కడం ఒక కొత్త అనుభవం.

Published by: Raja Sekhar Allu

రాత్రిపూట టెంట్లలో బస చేసే సౌకర్యం. రాత్రి నక్షత్రాల ఆకాశం కింద గడపడం చాలా బాగుంటుంది.

Published by: Raja Sekhar Allu

వంజంగి వెళ్లేవారు తప్పనిసరిగా స్వెటర్లు, గ్లౌజులు,టోపీలు వెంట తీసుకెళ్లండి,

Published by: Raja Sekhar Allu