అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు,మంత్రుల క్వార్టర్ల పనులు మరో ఆరు నెలల్లో పూర్తి



అమరావతి పనుల పర్యవేక్షణకు విదేశీ నిపుణులు కూడా వస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ఉంటుంది.



గతంలో ఆగిపోయిన సీఆర్డీఏ కార్యాలయాన్ని దాదాపుగా పూర్తిచేశారు. ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది.



మంత్రులు, జడ్జిల బంగ్లాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.



వివిధ రకాల ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలను భారీ యంత్రాలతో నిర్మిస్తున్నారు.



ప్రస్తుతం అమరావతిలో దాదాపుగా 13వేల మంది పని చేస్తున్నారు.



మంత్రి నారాయణ ప్రతి వారం అమరావతిలో పనుల్ని ప్రత్యక్షంగా పరిశీలించి కాంట్రాక్టర్లకు సూచనలు ఇస్తున్నారు.



చాలా భవనాలకు రంగుల పని కూడా పూర్తి కావొస్తోంది.



చెట్లను తీయాల్సిన చోట.. జాగ్రత్తగా తీసి మరో చోట నాటుతున్నారు.



రెండేళ్లలో రాజధానికి ఓ రూపం వస్తుందని మంత్రి నారాయణ నమ్మకంగా చెబుతున్నారు.