అన్వేషించండి

Rice Fish Farming : ఓ వైపు వరి సాగు అదే పంటలో చేపల పెంపకం.. 60 ఏళ్లుగా లాభాలు అర్జిస్తోన్న అపతాని తెగ

Eco Friendly Farming : వ్యవసాయం పేరుతో భూమికి హాని కలిగించకుండా.. వివిధ పద్ధతులు ఫాలో అవుతూ వరిని పండిస్తూ.. చేపలను కూడా ఒకేసారి పెంచేస్తూ లాభాలు అర్జిస్తున్నారు. ఎలా సాధ్యమైందంటే..

Apatani Farming : వ్యవసాయం పేరుతో భూమిలోకి రసాయనాలు పోసే పద్ధతులను పక్కన పెట్టి.. దాదాపు 60 ఏళ్లుగా సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. వరి పంటతో పాటు చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అపతాని తెగ. ప్రకృతిని పరిరక్షిస్తూ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో లోయలో నివసించే అపతాని తెగ.. తరతరాలుగా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రత్యేకమైన నీటి ఆధారిత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్నారు. దీనిని అపతాని పద్ధతి అంటారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా చురుకైన వ్యవసాయ మోడల్‌గా గుర్తింపు పొందుతోంది. దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అపతాని వ్యవసాయం 

అపతాని వ్యవసాయ పద్ధతి ఇతర పద్ధతుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు పర్వత ప్రవాహాల నీటిని.. వెదురు కాలువలు, టెర్రస్ వ్యవస్థ ద్వారా నియంత్రించి.. వరి పంటను సాగు చేస్తారు. వెదురుతో నిర్మించే ఈ టెర్రస్‌ వ్యవస్థ నీటిని పొలాల్లో నిల్వ చేసేలా పనిచేస్తుంది. 

ముందుగా వరి నాటి.. ఆపై చేపలను వదిలేస్తారు. ఈ పద్ధతిలో చేపలు పొలాల్లో ఉండే కీటకాలు, కలుపు మొక్కలు తిని బతుకుతాయి. అలాగే అవి ఈదడం వల్ల నేలలో గాలి ప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా పంట సారవంతంగా, హానికర కీటకాల లేకుండా పెరుగుతుంది. ఈ పద్ధతిని దాదాపు 60 ఏళ్లుగా ఫాలో అవుతూ చేపల పెంపకం, వరి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు ఈ తెగ.

Rice Fish Farming : ఓ వైపు వరి సాగు అదే పంటలో చేపల పెంపకం.. 60 ఏళ్లుగా లాభాలు అర్జిస్తోన్న అపతాని తెగ

కంపోస్ట్, ఎరువులు

ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను, పశువుల ఎరువులను వీరు కంపోస్ట్‌గా మార్చి పొలాల్లో ఉపయోగిస్తారు. అలాగే అజోల్లా, లెమ్నా వంటి మొక్కలు నత్రజని స్థిరపరచి నేల మరింత సారవంతంగా మారేలా హెల్ప్ చేస్తాయి. 

కూరగాయలు, పప్పులు, రాగులు వంటి అనేక పంటలు పండించేందుకు వీరు బండ్లు, సిమెంట్ పాత్రలు ఉపయోగిస్తారు. దీని వల్ల నీటి వృథా జరగదు. నిల్వ చేయడం కూడా సులభంగా ఉంటుంది.

అపతాని పద్ధతి వల్ల కలిగే లాభాలివే

ఈ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం వల్ల ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెమికల్స్ వినియోగం తగ్గుతుంది. వరి, చేపలను కలిపి సాగు చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. అలాగే నీటి వనరులను సంరక్షించవచ్చు. కంపోస్ట్, నత్రజనిత మొక్కల వాడకం వల్ల భూమి సారవంతం అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న రసాయన వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఈ పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. 

Rice Fish Farming : ఓ వైపు వరి సాగు అదే పంటలో చేపల పెంపకం.. 60 ఏళ్లుగా లాభాలు అర్జిస్తోన్న అపతాని తెగ

ఈ పద్ధతులు ఫాలో అవుతూ అపతాని తెగ.. వ్యవసాయం మాత్రమే కాకుండా నీటి వనరుల సంరక్షణ, అటవీ ప్రాంతాల పరిరక్షణలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి.. నీటి పంపిణీ, చేపల పెంపకం, పొలాల నిర్వహణ వంటి వ్యవస్థలను అందరూ కలిసికట్టుగా చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget