అన్వేషించండి

Pomegranate Gardening Guide : దానిమ్మ మొక్కను ఇంట్లోనే కుండీలో ఇలా పెంచేయండి.. ఫాలో అవ్వాల్సిన సింపుల్ టిప్స్ ఇవే

Pomegranate Plant Care : దానిమ్మను కేవలం భూమిలోనే కాదు.. కరెక్ట్​గా ట్రై చేస్తే కుండీల్లో కూడా మంచిగా పెంచుకోవచ్చు. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

Organic Pomegranate Growing : మొక్కల్ని పెంచుకోవాలనుకుంటే అపార్ట్​మెంట్​లో కూడా పెంచుకోవచ్చు. ఇవి చాలామంది చేసేవే. ఇంటిదగ్గర ఆవరణలో లేదా టెర్రస్ గార్డెన్ అంటూ చాలామంది మొక్కలు పెంచుకుంటారు. ఇండోర్​లో కూడా మొక్కలు పెంచుకునేవారు ఉన్నారు. మరి దానిమ్మ వంటి మొక్కను ఇలాంటి ప్లేస్​లో పెంచుతారా అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే దానిని భూమిలోనే వేస్తే బాగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ మీకు తెలుసా? కుండీలో కూడా దానిమ్మను బాగా పెంచి.. ఫ్రూట్స్ పొందవచ్చని. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. 

దానిమ్మ పండ్లు మీరు ఇంట్లోనే పెంచుకోవాలనుకుంటే.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. స్మార్ట్​గా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే దానిమ్మ మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. ఇంట్లోనే దానిమ్మను ఎలా పెంచుకోవాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మొక్క పెరుగుదల బాగుంటుందో.. కుండీలో పెంచుకోవడం సాధ్యమో కాదో తెలుసుకుందాం. 

ఎలాంటి మొక్కను ఎంచుకోవాలంటే.. 

దానిమ్మను ఇంట్లో లేదా గార్డెన్​లో పెంచుకోవాలనుకుంటే మంచి బ్రీడ్​ని ఎంచుకోవాలి. పునికా గ్రానటం ఎల్ అనే దానిమ్మ సాగుకు మంచిదని చెప్తారు. బోన్సాయి రకాల్లో దానిమ్మను చెట్టును ఎంచుకుంటే కుండీలకు అవి పర్​ఫెక్ట్​గా ఉంటాయి. వాటిని పెంచుకోవడం కూడా మీకు సులభంగా ఉంటుంది. చిన్న ప్లేస్​ ఉండేవారికి ఇది బాగా కలిసివస్తుంది. 

కుండీ పెద్దదే ఉండాలి 

నార్మల్​గా ఇంట్లో పెంచుకునే మొక్కలకు చిన్న కుండీలు సరిపోతాయి. దానిమ్మ కోసం కాస్త పెద్దగా ఉండే కంటైనర్ ఎంచుకుంటే మంచిది. అలాగే డ్రైనేజ్ వెళ్లేందుకు ఖాళీ ఉండేలా చూసుకోండి. దీనివల్ల వేరు బాగా పెరుగుతుంది. ఓ కుండీలో పెంచిన తర్వాత మరో కుండీలో మొక్కను మార్చడాన్ని నిరోధించాలి. 

ఎరువు..

కుండీలో మట్టిని, కంపోస్ట్, సహజమైన ఎరువును ఉంచాలి. ఇది వేరును బలిష్టంగా ఉంచుతుంది. లేయర్ పద్ధతిలో కుండీలో మట్టిని వేయాలి. మధ్యలో ఎండిన ఆకులను వేసుకుని.. మళ్లీ ఎరువు, మట్టి వేసుకోవాలి. దీనివల్ల వేరు దృఢంగా పెరుగుతుంది. ఇప్పుడు దానిమ్మ మొక్కను ప్లేస్ చేయాలి. 

సన్​ లైట్

సూర్యరశ్మి మొక్కకు అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దానిమ్మ చెట్టు సూర్యరశ్మికి బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ కుండీని ఎండ వచ్చే ప్రదేశంలో ఉంచాలి. మొక్కకు ఎండ తగిలితే పండు సైజ్, స్వీట్​నెస్ పెరుగుతుంది. 6 నుంచి 8 గంటల సన్​లైట్ మొక్కపై పడేలా చూసుకుంటే మంచిది. 

ఎలా శ్రద్ధ తీసుకోవాలంటే.. 

రోజూ మొక్కకి నీరు పోయండి. ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్​ను వేసుకోవచ్చు. ఆవు పేడ, వంటింట్లోని కూరగాయల వ్యర్థాలు మొక్కకి వేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క పెరుగుతున్నప్పుడు ఎండిన కొమ్మలుంటే కట్ చేసేయాలి. మొక్క పైభాగాన్ని ట్రిమ్ చేయడం వల్ల దానిమ్మ మొక్క ఏపుగా పెరుగుతుంది. 

పురుగులు రాకుండా.. 

దానిమ్మ చెట్టుకి పురుగులు సోకకుండా.. వేప నూనె స్ప్రే చేయవచ్చు. 5 మిల్లీ లీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో వేసి బాగా కలిపి.. దానిని మొక్కకి స్ప్రే చేయాలి. బియ్యం కడిగిన నీటిని పులియబెట్టి కూడా మొక్కకు వేయొచ్చు. ఇది కూడా పురుగులు దరిచేరుకుండా చేస్తుంది. 

ఇదే విధంగా మీరు మొక్కని హెల్తీగా పెంచగలిగితే 5 లేదా 6 నెలలకు దానిమ్మలు రెడీ అయిపోతాయి. దానిమ్మ తొక్కను బట్టి మీరు వాటిని కట్​ చేసుకోవచ్చు. మరి ఇంకేం ఆలస్యం. ఇంట్లోనే ఇలా ఈజీగా దానిమ్మ మొక్కలను పెంచేసి.. జ్యూసీ దానిమ్మలను ఆస్వాదించేయండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Jana Nayagan Producer: 'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Lionel Messi Record: బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
బెంచ్ కే పరిమితమైనా తగ్గని మెస్సి క్రేజ్.. జొర్డాన్‌ను కుమ్మేసిన అర్జెంటీనా, వరుసగా ఏడో మ్యాచ్ లోనూ గోల్ కొట్టి సరికొత్త వరల్డ్ రికార్డ్!
Embed widget