అన్వేషించండి

Lion Pride: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

Lion Pride:నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది అనే డైలాగ్‌ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. ఒంటరిగా ఏ పని చేయాల్సి వచ్చినా దీన్నే చెబుతుంటారు. కానీ వాస్తవం పూర్తిగా భిన్నం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సింహాలు ఒంటరిగా ఉండవు, అవి 'ప్రైడ్' అనే సమూహంలో నివసిస్తాయి.
  • ప్రైడ్‌లో మగ సింహాల కంటే ఆడ సింహాలే కీలక పాత్ర పోషిస్తాయి.
  • వేట, ఆహార సేకరణ బాధ్యతలను ఆడ సింహాలు నిర్వహిస్తాయి.
  • మగ సింహాలు తమ ప్రైడ్‌కు రక్షణగా, ఆధిపత్యం ప్రదర్శిస్తాయి.

Lion Pride: శివాజీ సినిమాలో విలన్‌లను ఉద్దేశించి హీరో రజనీకాంత్ చెప్పే "నాన్నా పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది!" అని చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఆ సినిమా విడుదలైన సంవత్సరాలు అయిపోయినా సరే ఆ డైలాగ్ మాత్రం జనం నిత్యం ఏదో చోట వింటూనే ఉన్నారు. హీరో ఎలివేషన్ కోసం ఆ డైలాగ్‌ను రాశారు. కానీ వాస్తవంగా సింహం సింగిల్‌గా ఉండదని స్టడీస్‌ చూస్తే అర్థమవుతుంది. అందుకే ఇకపై ఆ డైలాగ్ చెప్పే ముందు ఒకసారి వాస్తవం తెలుసుకుంటే మంచిది. 

అడవి అంటేనే ఒక పోరాటం, మనుగడ కోసం ప్రతి జీవి పోరాడుతుంది. ఆకలి తీర్చుకొని బతకడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి దేనికైనా పోరాటం తప్పదు. ఇలాంటి యుద్ధంలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న జంతువు సింహం. సాధారణంగా అడవిలోని అన్ని జంతువులు కూడా ఒంటరిగానే వేట సాగిస్తాయి. కానీ సింహం మాత్రం పూర్తిగా భిన్నం. సింహాలు తమకంటూ ఒక సామాజిక నిర్మాణాన్ని, క్రమశిక్షణతో కూడిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీనినే ప్రైడ్ అంటారు. 

ఇంతకీ ప్రైడ్ అంటే ఏంటీ? సింహాలు సింగిల్‌గా తిరుగుతాయా?

సింహాలు సాధారణంగా సింగిల్‌గా తిరగవు. అవి ఎప్పుడూ ఒక సమూహంగా ఉండటానికే ఇష్టపడాయి. ఈ సమూహాన్ని లయన్స్ ప్రైడ్ అంటారు. ఒక ప్రైడ్‌లో పది నుంచి 20 వరకు సింహాలు ఉంటాయి. ఈ సామాజిక నిర్మాణంలో సభ్యుల మ్య పనులు విభజించి ఉంటాయి. ఒక ప్రైడ్‌లో ప్రధానంగా ఒకరి నుంచి మూడు మగ సింహాలు ఉంటాయి. అవి ఆ గుంపునకు నాయకత్వం వహిస్తాయి. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం ఆడ సింహాలు, వాటి పిల్లలు ఉంటాయి. 

ఈ ప్రైడ్‌ వ్యవస్థ అనేది కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు. అది ఒక బలమైన రక్షణ కవచం. శత్రువుల నుంచి రక్షణ పొందడానికి, సమర్థవంతంగా వేటడటానికి ఈ వ్యవస్థ ఎంతో తోడ్పడుతుంది. 

ఆడ సింహాలదే కీలక పాత్ర

ప్రైడ్‌లో అత్యంత కీలకం ఆడ సింహాలే. ఆహార సేకరణ, వేటాడటం, లాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తాయి. తమ కంటే పరిమాణంలో పెద్దవైన జంతువులను లేదా బలహీనంగా ఉన్న జంతువులను వేటాడుతాయి.

మగ సింహాలు సెక్యూరిటీ గార్డులే 

ప్రైడ్‌లో మగ సింహాల పాత్ర సెక్యూరిటీ గార్డులాంటింది. గుంపులోని మగ సింహాలు గుంపునకు రక్షణగా ఉంటాయి. ఇతర మగ సింహాల నుంచి, ఇతర క్రూర మృగాల నుంచి కాపాడటమే వీటి పని. కేవలం మగ సింహం తన గంభీరమైన గర్జనతో, శక్తితో తన ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. 

సింహాలు ఎక్కువగా గుంపులుగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి ఒంటరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా మగ సింహాలు తమ యవ్వన దశలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రైడ్ కోసం వెతుక్కునే టైంలో ఒంటరిగా తిరుగుతాయి. తన పాత ప్రైడ్ నుంచి విడిపోయి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించే వరకు ఇలా ఒంటరిగా తిరుగుతాయి. 

ఇప్పుడు అర్థమైందా రాజా! ఇకపై నేను సింహాన్ని నేను ఒంటరిగా వస్తా అనే ఫోజులు కొట్టొద్దు. ప్రైడ్‌లో కూడా ఆడ సింహం వేటకు వెళ్లకపోతే మగ సింహ ఆకలితో పస్తులు ఉండి చావాల్సిందే. అందుకే వాస్తవాలు తెలుసుకోకుండా సినిమా డైలాగ్స్ చెప్పొద్దు. 

Frequently Asked Questions

సింహాలు ఒంటరిగా జీవిస్తాయా?

సింహాలు సాధారణంగా ఒంటరిగా జీవించవు. అవి ఎప్పుడూ 'లయన్స్ ప్రైడ్' అనే సమూహంగా ఉంటాయి. ఈ ప్రైడ్ లో సుమారు 10 నుంచి 20 సింహాలు ఉంటాయి.

లయన్స్ ప్రైడ్ అంటే ఏమిటి?

లయన్స్ ప్రైడ్ అంటే సింహాలు నివసించే ఒక సామాజిక సమూహం. ఇందులో మగ సింహాలు, ఆడ సింహాలు, వాటి పిల్లలు ఉంటాయి. ఇది బలమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ప్రైడ్ లో ఆడ సింహాల పాత్ర ఏమిటి?

ప్రైడ్ లో ఆడ సింహాలదే కీలక పాత్ర. ఆహార సేకరణ, వేటాడటం వంటి బాధ్యతలను అవి నిర్వహిస్తాయి. ఇవి తమ కంటే పెద్ద జంతువులను కూడా వేటాడగలవు.

మగ సింహాల విధులు ఏమిటి?

మగ సింహాలు ప్రైడ్ కు సెక్యూరిటీ గార్డుల వలే పనిచేస్తాయి. ఇతర మగ సింహాల నుంచి, ఇతర క్రూర మృగాల నుంచి గుంపును కాపాడటం వీటి పని.

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget