World Lion Day 2025 : ప్రపంచ సింహాల దినోత్సవం.. పళ్లు పుచ్చిపోతే సింహాలు చనిపోతాయా? అంతరించిపోవడానికి ఇది కూడా కారణమేనా?
Lion Day : సింహం పళ్లు పుచ్చిపోతే చనిపోతాయా? దీనిలో నిజమెంతా? ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా దీని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

World Lion Day : మనిషిలాగే చాలా జంతువులు దంతాల ద్వారా ఆహారం తీసుకుంటాయి. అలాంటి వాటిలో సింహం కూడా ఒకటి. అడవికి రాజు అయిన సింహం కూడా తన దంతాల ద్వారానే వేటాడి తింటుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే.. సింహం తన దంతాలు పుచ్చిపోవడం వల్ల కూడా చనిపోతుందట. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఈ ఇంట్రెస్టింగ్ విషయం నిజమో.. కాదో.. దాని వెనుక కారణం ఏమిటో.. పళ్లు పుచ్చిపోవడం వల్ల సింహాలు నిజంగా మరణిస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
అడవికి రారాజు అయిన సింహాలు అంతరించిపోవడం గుర్తించి.. వాటిపై మనుగడ, అటవీకి వాటివల్ల ఉన్న అవసరాన్ని గుర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సింహాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 10వ తేదీన దీనిని జరుపుతున్నారు. 2013 ఆగస్టు 10వ తేదీన ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దాని గురించి వివిధ విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగానే దంతక్షయం వల్ల సింహాలు చనిపోతాయో లేదో.. తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం.
జంతువుల దంతాలు పాడవుతాయా?
అడవి సింహం, చిరుతపులి, పులి, మొసలితో సహా ఇతర జంతువులన్నీ తమ దంతాల ద్వారానే వేటాడతాయి. కానీ మనుషుల్లాగే వాటి దంతాలు కూడా పాడవుతాయా లేదా వాటి దంతాలకు కుళ్లిపోతాయా అనేది చాలామందికి ఉండే డౌట్. ఎందుకంటే ఇవి కూడా మాంసాహారులే. అయితే జంతువుల దంతాలు తక్కువగా పాడవుతాయట. కానీ సింహం వంటి జంతువుల దంతాలు పాడైతే.. అవి మరణానికి దారి తీస్తాయని చెప్తున్నారు.
పులులు, ఇతర పెద్ద పిల్లుల మాదిరిగానే.. పిల్లి కుటుంబ సభ్యులకు చాలా ఎక్కువ pH విలువ కలిగిన లాలాజలం ఉంటుంది. ఈ లాలాజలం వారి ఎనామిల్, దంతాల పై ఉండే పొరను రక్షిస్తుంది. తద్వారా వారికి పళ్లు పుచ్చిపోవడం, దంత క్షయం(కావిటీస్) వంటి సమస్యలు పెద్దగా ఉండవట. అయితే.. కొన్నిసార్లు సింహంతో సహా పులి దంతాలు కూడా కుళ్లిపోతాయట. వాటివల్ల అవి మరణిస్తాయి కూడా అని చెప్తున్నారు నిపుణులు.
దంతక్షయంతో సింహాలు చనిపోతాయా?
పరిశోధనల ప్రకారం.. అడవి జంతువులకు దంతాల సమస్య ఉంటే అది వాటి మనుగడకు, మరణానికి మధ్య కొన్ని అంశాలపై ప్రభావం చూపిస్తుందట. ఎందుకంటే సింహం వంటి మంచి వేటగాడు.. వేటాడటానికి మంచి దంతాలు ఉండాలి. మాంసాహార తినే పెద్ద పిల్లుల జాతులు.. వాటిని కొరికేందుకు, చీల్చుకోవడానికి దంతాలు ఉండాలి. పరిశోధన ప్రకారం.. ఏదైనా ప్రమాదంలో పళ్లు కుళ్లిపోవడం లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా పెద్ద పిల్లులు, సింహాల్లో దంతాలు ఊడితాయి. దీనివల్ల వాటికి ఆహారం తినడం చాలా తగ్గిపోతుంది. క్రమంగా అది క్షీణించి మరణిస్తుంది.
దీనికి భిన్నంగా చిలీ జంతుప్రదర్శన శాలల్లోని సింహాలు అడవుల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నాయట. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ సింహాలకు మృదువైన ఆహారం తినడం వల్ల వాటిలో దంతాల సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే జూలలో పశువైద్యులు ఉంటారు. వారు ఎప్పటికప్పుడు జంతువులను చూసుకుంటారు. అవసరమైనప్పుడు పశువైద్యులు జంతువుల దంతాలను కూడా తీస్తారు. కానీ అడవుల్లో ఇది సాధ్యం కాదు. దీని కారణంగా సింహం వంటి జంతువులలో ఇన్ఫెక్షన్లు వ్యాప్తి పెరిగి.. చనిపోతున్నాయని చెప్తున్నారు నిపుణులు. ఇలా సింహాల సంఖ్య తగ్గడంలో దంతక్షయం కూడా ఓ కారణమవుతుంది.






















