అన్వేషించండి
స్లీపర్ టికెట్‌తో AC కోచ్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు, జస్ట్ ఈ పని చేయండి చాలు...!
ITRTC Ticket Updation: స్లీపర్ టికెట్ ఉన్నా AC లో సీటు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో AC ప్రయాణం చేయడం ఎలాగో తెలుసుకోండి.
స్లీపర్ టికెట్‌తో AC కోచ్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు, జస్ట్ ఈ పని చేయండి చాలు...!
1/6

చాలా సార్లు ప్రజల వద్ద AC కోచ్ టికెట్ బుక్ చేసుకోవడానికి సరిపడినంత డబ్బులు ఉండవు, అందుకే వారు స్లీపర్ లో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణిస్తారు. కానీ మీకు తెలుసా స్లీపర్ టికెట్ మీద కూడా మీరు AC కోచ్ లో ప్రయాణించవచ్చు. అయితే దీని కోసం మీరు ముందుగా ఒక పని చేయాలి.
2/6

ట్రెయిన్ జర్నీలో సీట్ల పునః అమరిక చాలాసార్లు జరుగుతుంది. అంటే, AC కోచ్‌లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే, సిస్టమ్ ఇతర కోచ్‌లలోని ప్రయాణీకులను వాటికి మార్చవచ్చు. మొత్తం ప్రక్రియ ఆటోమేషన్‌లో జరుగుతుంది. మీ స్లీపర్ టికెట్ కూడా AC లోకి మారవచ్చు.
3/6

ఈ సదుపాయాన్ని పొందడానికి మీరు IRCTC నుండి ఆన్‌లైన్లో రైలు టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీరు టికెట్ బుకింగ్ వివరాలను నమోదు చేసినప్పుడు అక్కడ మీరు ఉన్నత తరగతికి అప్గ్రేడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో 'అవును' అని క్లిక్ చేయాలి.
4/6

మీరు ఇందులో No ఎంచుకుంటే, మీ టికెట్ మారదు. మీరు ఏ ఎంపికను ఎంచుకోకపోతే, అది ఆటోమేటిక్‌గా YES తీసుకుంటుంది. స్లీపర్లో టికెట్ లేకపోతే ACలో ఉంటే, మీ టికెట్ ACకి అప్గ్రేషన్ అయిపోతుంది.
5/6

ఈ సదుపాయం Indidan Railway అందిస్తుంది. దీని కోసం మీ నుండి ఎటువంటి అదనపు ఛార్జీలు తీసుకోరు. ఒకవేళ ACలో సీట్లు ఖాళీగా ఉంటే, స్లీపర్ టికెట్‌తో కూడా మీరు AC కోచ్‌లో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. కాబట్టి టికెట్ బుక్ చేసేప్పుడు AC కోసం ఎక్కువ డబ్బులు కట్టాలేమో అని భయపడి.. ఆప్షన్స్‌లో NO అని పెట్టకండి. అసలు ఏమీ పెట్టకపోయినా పర్లేదు. కానీ NO అని పెడితే.. స్లీపర్‌లో టికెట్ లేకపోతే.. అసలు టికెట్ కూడా బుక్ అవ్వదు.
6/6

అంతేకాకుండా ఏసీ కోచ్‌లో సీట్లు ఖాళీగా ఉంటే టీటీఈ స్లీపర్ టికెట్ ఉన్న ప్రయాణికులను ఏసీ కోచ్‌కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ముఖ్యంగా నైట్ రైళ్లలో ఈ అవకాశం ఎక్కువ. ఎందుకంటే కొంతమంది చివరి నిమిషంలో ఎక్కరు. అయితే ఇది లభ్యతను బట్టి ఉంటుంది.
Published at : 21 Nov 2025 07:08 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















