Tooth loss is linked with Alzheimers : పళ్లు ఊడిపోతున్నాయా జాగ్రత్త.. ఆ సమస్య వస్తుందంటున్న కొత్త అధ్యయనం
Tooth Loss : దంతాలు ఎక్కువగా ఉన్నవారి కంటే తక్కువ దంతాలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. తాజా అధ్యయనం తెలిపింది.
Oral Health Conditions : నోటి సంరక్షణ అనేది ఎంత ముఖ్యమో మరోసారి తెలిపింది తాజా అధ్యయనం. దంతాలు తక్కువగా ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దంతాలు ఎక్కువగా ఉన్నవారి కంటే.. తక్కువగా ఉన్నవారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అల్జీమర్స్ ప్రభావం కూడా వీరిపై ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే దంతాలకు.. మెదడుకు ఉన్న సంబంధం ఏంటో.. పరిశోధకులు దీని గురించి ఏమి చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చిగుళ్ల వ్యాధితో ఇబ్బందులు
జ్ఞాపకశక్తికి కీలకమైన ప్రాంతం దంతాలు అని.. వాటి నష్టం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలిపారు. ఫాగియన్ C.M నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. దంతాల నష్టం అల్జీమర్స్‌కు దారితీస్తుందని వెల్లడించారు. చిగుళ్ల వ్యాధితో దంతాలు ఊడిపోయినప్పుడు లేదా కోల్పోయినప్పుడు వాటిలోని బ్యాక్టీరియా అల్జీమర్స్ బారిన పడిన మెదడు ప్రాంతాలపై దాడి చేస్తుందని పరిశోధనలో తేలింది. చిగుళ్ల వ్యాధి కూడా దంతాల నష్టానికి ప్రధాన కారణమని పరిశోధకులు వెల్లడించారు. అందుకే దంతాల విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ప్రపంచ జనాభాలో 50 శాతం మందిపై ప్రమాదం ఉంది..
దంతాల నష్టానికి ప్రధాన కారణాలలో పీరియాంటల్ వ్యాధి ఒకటి. పీరియాడోంటైటిస్ అనేది నోటి ద్వారా వచ్చే సమస్య. ఇది దంతాలను ప్రభావితం చేసి.. మృదు కణజాలాన్ని నాశనం చేస్తుంది. మొత్తంగా దంతాలను కోల్పోయేలా ప్రేరేపిస్తుంది. ఈ సమస్య ప్రపంచ జనాభాలో 50 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి ప్రమాద కారకాల వల్ల ఇది వస్తుంది. దంతాల నష్టం వివిధ మార్గాల్లో అభిజ్ఞా పనితీరుపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పీరియాంటల్ వ్యాధి కూడా అల్జీమర్స్‌కు ప్రధాన కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆ సమస్యలు మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి..
ప్రో ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు ప్లాస్మాలో పెరిగినా కూడా మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఇవి దంతాల ఆరోగ్యంపైనే డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్య సమయంలో దంతాలలో హిస్టోపాథలాజికల్ మార్పులు వస్తాయి. ఇవి పళ్లలో వాపు, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి. దంతాల నష్టానికి దారితీస్తాయి. అసిటైల్కోలిన్ స్థాయిలలో తగ్గుదల, హిప్పోకాంపస్ కణాల సంఖ్య కూడా ప్రభావితం చేసి దంతాలు బలహీనపడేలా చేస్తాయి. అల్జీమర్స్‌తో బాధపడేవారిలో దంతాలను మళ్లీ అమర్చడం కష్టమని అధ్యయనం తెలిపింది. కానీ ఇంప్లాంట్స్‌పై లోడ్ చేసి.. పరిస్థితిని మెరుగపరచవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అలాగే రోగికి, రోగికి సహాయం చేయడానికి కేటాయించిన వారికి దీనిపట్ల అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితా పొందవచ్చు అంటున్నారు.
దంతాల సంరక్షణకు ఇవి ఫాలో అవ్వాలి
ఈ అధ్యయనం దంతాల సంరక్షణ ప్రాధాన్యతను మరోసారి తెలిపింది. రోజుకి రెండుసార్లు బ్రష్ చేయడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. స్మోకింగ్, కూల్ డ్రింక్స్ తాగడం, మధ్యపానం వంటివి దంతాలను వీక్ చేస్తాయి. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల దంతాలు పాడైపోతాయి. రెగ్యూలర్‌గా చెకప్ చేయించుకోవాలని.. పంటి సమస్యలను అశ్రద్ధ చేయకపోవడమే మంచిది అంటున్నారు. అంతేకాకుండా దంతాల సమస్యకు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. మౌత్ ఫ్రెషనర్స్, ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు నిపుణులు.
Also Read : ఎలాంటి ఎఫర్ట్ లేకుండా కొంబుచా టీతో బరువు తగ్గిపోతారట.. ఈ ఫంగస్ టీపై న్యూ స్టడీ ఏమంటుందంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.