బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలని చాలామంది చూస్తుంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో అది జరగదు. అలాంటప్పుడు కొన్ని డ్రెస్‌లు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ కొన్ని ఫ్యాషన్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్‌ని కవర్ చేయవచ్చు. హై వెయిస్టెడ్ జీన్స్ లేదా కార్గో జీన్స్ బెల్లీ ఫ్యాట్‌ను కవర్ చేస్తాయి. వదులుగా ఉండే దుస్తులు కూడా బెల్లీ ఫ్యాట్స్‌ను కనపడకుండా చేస్తాయి. నిలువుగా లైన్స్ ఉండే టాప్‌లు ఎంచుకోవడం వల్ల కూడా బెల్లీ కనిపించదు. డ్రెస్‌ని లేయర్ చేయండి. టీ షర్ట్‌ని మరో షర్ట్‌తో లేదా కోట్తో పెయిర్ చేస్తే బెల్లీ కనిపించదు. నడుము దగ్గర పెద్దగా, హెవీగా ఉండే డిజైనర్ బెల్ట్స్ పెట్టుకోవచ్చు. (Images Source : Unsplash)