అన్వేషించండి

Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!

Hypersonic Travel:ఆరు గంటల ప్రయాణాన్ని కేవలం టీ తాగే లోపు చేరుకోవచ్చు. శబ్దవేగం కంటే ఐదు రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ టెక్నాలజీలో జపాన్ కీలక ముందడుగు వేసింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక వేడి, అస్థిర గాలి ప్రవాహాలను నియంత్రించడం అతిపెద్ద సవాలుగా ఉంది.

Hypersonic Travel:మీరు ఢిల్లీలో కాఫీ కప్పు పట్టుకుని కూర్చుంటే, అది పూర్తి చేసేలోపే మీరు దుబాయ్‌లో ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది. వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కబురులా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీనిని నిజం చేసే పనిలో ఉన్నారు. సాధారణ విమానాల వేగానికి, కాలానికి ఇక చెల్లుచీటీ పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.  గంటల కొద్దీ సాగే విమాన ప్రయాణాలను నిమిషాల్లోకి కుదించే హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ ఇప్పుడు గ్లోబల్ ట్రాన్స్‌పోర్ట్ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది.

హైపర్ సోనిక్ అంటే ఏంటీ?

సాధారణంగా మనం శబ్ద వేగాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. శబ్ద వేగం గాలిలో గంటకు సుమారు 1225 కిలోమీటర్లు ఉంటుంది. శబ్ద వేగం కంటే ఎక్కువ ఉంటుంది సూపర్ సోనిక్. శబ్ద వేగం కంటే కనీసం ఐదు రెట్లు లేదా అంత కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే టెక్నాలజీయే హైపర్ సోనిక్ అంటారు. అంటే గంటకు 6000కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం అన్నమాట. ఈ వేగంతో ప్రయాణిస్తే, న్యూయార్క్ నుంచి లాస్ ఏంజెల్‌ మధ్య ఉన్న 4400 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15నిమిషాల్లో దాటేయవచ్చు. 

జపాన్ సాధించిన అద్భుత విజయం 

హైపర్ సోనిక్ ప్రయాణం వైపు ప్రపంచ దేశాలు పోటీ పడుతుండగా జపాన్ ఇటీవల ఒక కీలక మైలురాయిని అధిగమించింది. జపాన్ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, టోక్యో యూనివర్శిటీ, ఇతర ప్రముఖ సంస్థలతో కలిసి ఒక రామ్‌జెట్‌ ఇంజిన్ విజయవంతంగా పరీక్షించింది. 

Also Read: వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?

మియాగీ ప్రీఫెక్చర్‌లోని కకుడా స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఒక రెండు మీటర్ల ప్రయోగాత్మక వాహనాన్ని Mach5 వేగం వద్ద ఉండే కృత్రిమ వాతావరణంలో ఉంచి పరీక్షించారు. ఆ వాహనం నిజంగా ఎగరకపోయినప్పటికీ, హైపర్‌ సోనిక్ వేగం వద్ద ఏర్పడే విపరీతమైన వేడిని, ఒత్తిడిని తట్టుకుని నిలబడటంలో విజయం సాధించింది 

రామ్‌జెట్‌ ఇంజిన్ ఎలా పని చేస్తుంది?

సాధారణ జెట్ ఇంజిన్లలో గాలిని లోపలికి పంపడానికి పెద్ద పెద్ద ఫ్యాన్ రెక్కలు ఉంటాయి, కానీ రామ్‌జెట్‌ ఇంజిన్లలో కదలే భాగాలు ఏవీ ఉండవు. విమానంలో అత్యంత వేగంతో దూసుకుపోతున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలి నేరుగా ఇంజిన్‌లోకి వెళ్తుంది. ఈ వేగం వల్ల గాలి తనంతట తానుగా కంప్రెస్‌ అవుతుంది. 

Also Read: భోజనం తర్వాత ఎంత సమయానికి నీళ్లు తాగాలి? మధ్య మధ్యలో వాటర్ తాగడం మంచిదా కాదా?

ఇలా కంప్రెస్ అయిన గాలికి ఇంధనాన్ని కలిపి మండిస్తారు. హైడ్రోజన్ అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా వేగంగా మండుతుంది కాబట్టి Mach5 వేగాన్ని స్థిరంగా కొనసాగించడానికి ఇది తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తి విమానాన్ని ముందుకు నెడుతుంది. 

ప్రయోగం నిప్పుతో చెలగాటమే!

హైపర్ సోనిక్ ప్రయాణం అనేది కేవలం వేగానికి సంబంధించినది మాత్రమే కాదు. ప్రాణాలకు భద్రత కల్పించడం అతి పెద్ద సవాలు. విమానం Mach5 వేగంతో గాలిని చీల్చుకుంటూ వెళ్తున్నప్పుడు, ఘర్షణ వల్ల దాని చుట్టూ ఉష్ణోగ్రత దాదాపు 1000 నుంచి 1900 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఇంత వేడికి సామాన్యమైన లోహాలు కరిగిపోతాయి. 

Also Read: నాన్నా పందులే కాదు సింహం కూడా గుంపుగానే వస్తుంది! ఎలివేషన్స్‌ ఇచ్చే ముందు వాస్తవం తెలుసుకో!

అంతా వేగంలో గాలి ప్రవాహం అస్థిరంగా మారుతుంది. దీని వల్ల విమానాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. విమానం బరువు తక్కువగా ఉండాలి. అదే సమయంలో అత్యంత బలంగా ఉండాలి. బరువైన పదార్థాలు వాడితే వేగం తగ్గుతుంది. తేలికపాటి పదార్థాలు వాడితే వేడిని తట్టుకోలేవు. 

భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది?

జపాన్ చేసిన ఈ పరీక్షలో ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. వారి వాహనం లోపల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌, కంట్రోల్‌ డివైజ్‌లు స్థిరంగా పని చేయగలిగాయి. దీని అర్థం మనం సరైన థర్మల్ ప్రొటెక్షన్ షీల్డ్స్‌ అభివృద్ధి చేస్తే మానవ ప్రయాణం సాధ్యమే. 

హైపర్ సోనిక్ విమానాలు అందుబాటులోకి వస్తే ఒక ఖండం నుంచి మరో ఖండానికి ప్రయాణం కేవలం గంటలోపే ముగుస్తుంది. మెడికల్‌ ఎమర్జెన్సీ లేదా విపత్తు సమయాల్లో సహాయ సామాగ్రిని నిమిషాల్లోనే ప్రపంచంలో ఎక్కడికైనా  చేరవేయవచ్చు. వ్యాపార లావాదేవీలు, డెలివరీలు శరవేగంగా జరుగుతాయి. 

హైపర్ సోనిక్ ప్రయాణం ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ప్రయాణికుల కోసం ఇది అందుబాటులోకి రావడానికి మరికొన్ని ఏళ్లు పట్టవచ్చు. ఇంజిన్ల సామర్థ్యం, పర్యావరణ ప్రభావం, భద్రతా ప్రమాణాలను శాస్త్రవేత్తలు ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు.

Frequently Asked Questions

హైపర్ సోనిక్ ప్రయాణం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

హైపర్ సోనిక్ ప్రయాణం ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని ఏళ్లు పట్టవచ్చు. భద్రతా ప్రమాణాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Embed widget