అన్వేషించండి

Best Budget SUVs India: మధ్యతరగతి కలల వాహనం 6 లక్షలకే! మైలేజీ, భద్రతలో మేటి అయిన టాప్ ఎస్‌యూవీలు ఇవే!

Best Budget SUVs India: భారత్‌లోని మధ్య తరగతి కుటుంబాల కోసం బడ్జెట్‌ ధరల్లో లభిస్తున్న అత్యుత్తమ ఎస్‌యూవీలు పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా పంచ్: 5-స్టార్ భద్రత, 20.09 km/l మైలేజీతో లభ్యం.
  • హ్యుందాయ్ ఎక్స్టర్: డాష్‌క్యామ్, సన్‌రూఫ్‌తో 19.4km/l మైలేజీనిస్తుంది.
  • నిస్సాన్ మాగ్నైట్: 360° కెమెరా, 19.35 km/l మైలేజీతో పెద్ద SUV.
  • స్కోడా కైలాక్: 5-స్టార్ భద్రత, 19.68 km/l మైలేజీతో లభ్యం.

Best Budget SUVs India: నేటి కాలంలో సొంత కారు అనేది ఒక విలాసం మాత్రమే కాదు, కుటుంబ అవసరంగా మారింది. ముఖ్యంగా భారతీయ రోడ్లపై ప్రయాణించడానికి పటిష్టమైన నిర్మాణం, అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఎస్‌యూవీల పట్ల మధ్యతరగతి ప్రజల మక్కువ చూపుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, ముఖ్యంగా మైలేజీని ఆశించే సామాన్యుల కోసం భారత్ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు అత్యుత్తమ బడ్జెట్‌ ఎస్‌యూవీల గురించి చూద్దాం. 

భద్రతకు మారుపేరుగా టాటా పంచ్‌

టాటా మోటార్స్‌ నుంచి వచ్చిన పంచ్‌, మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భారతీయ కుటుంబాలు ఈ కారును ఎంచుకోవడానికి ప్రధాన కారణం దీని పటిష్టమైన నిర్మాణ నాణ్యత. టాటా పంచ్‌ గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్ టెస్టులో ఫైవ్‌ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇది చిన్న పిల్లు, వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలకు గరిష్ట భద్రతను ఇస్తుంది. ఇందుోల ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి. 

Read Also: BYD DMi Super PlugIn Hybrid Technology: బీవైడీ డీఎమ్-ఐ హైబ్రిడ్ టెక్నాలజీ టీజర్ రిలీజ్ - అదిరిపోయే రేంజ్, ఫీచ‌ర్లు  

ఇందులో ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ‌, ఆటోమేటిక్‌ క్లెమేట్‌ కంట్రోల్‌, ఆకర్షణీమైన సన్‌రూఫ్‌ ఉన్నాయి. ట్విన్ సిలిండర్ టెక్నాలజీ వల్ల బూట్‌ స్పేస్ కూడా విశాలంగా ఉంటుంది. 1.2లీటర్‌ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు లీటరుకు సుమారు 20.09 కిలోమీటర్లు మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్‌- షోరూమ్‌ ధర రూ. 5,64,990గా ఉంది. మైలేజీయే ప్రాణంగా భావించే వారి కోసం సీఎన్జీ వేరియంట్‌ అందుబాటులో ఉంది. ఇది కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. 

టెక్నాలజీలో హ్యుందాయ్ ఎక్స్టర్‌ టాప్‌

మధ్యతరగతి కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా హ్యుందాయ్ రూపొందించిన మోడల్ ఎక్స్టర్‌. ఇది ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్ల కలయిక. ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా డాష్‌క్యామ్‌, సింగిల్‌ పేన్‌ సన్‌రూఫ్‌ను హ్యుందాయ్‌ ప్రవేశపెట్టింది. లాంగ్‌ జర్నీలలో అలసట కలగకుండా దీని క్యాబిన్‌ లోపల గాలి వెలుతురు ధారళంగా ఉండేలా డిజైన్ చేశారు.

Read Also: MG Majestor SUV Launched: ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీ లాంచ్: టయోటా ఫార్చూనర్‌కు గట్టి పోటీగా వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్..

అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్త భద్రతకు పెద్దపీట వేసింది. 1.2- లీటర్‌ 4-సిలిండర్‌ ఇంజిన్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. పెట్రోల్‌ వెర్షన్‌ 19.4km/l మైలేజీని ఇస్తుండగా, కంపెనీ ఫిట్జెడ్‌ సీఎన్జీ వెర్షన్‌ 27.1 km/kg మైలేజిని అందిస్తుంది. దీని ప్రారంభ ధర 5, 79, 900

భారీ ఎస్‌యూవీగా పేరున్న నిస్సాన్ మాగ్నైట్‌ 

తక్కువ ధరలో ఒక పెద్ద ఎస్‌యూవీ నడుపుతున్నామనే అనుభూతిని నిస్సాన్‌ మగ్నైట్‌ కలిగిస్తుంది. దీని బోల్డ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, స్పోర్టీ డిజైన్‌ రోడ్డుపై ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. 360- డిగ్రీ కెమెరా, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో/ ఆపిల్‌ కార్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐదుగురు సభ్యులు గల కుటుంబం ప్రయాణించడానికి తగినంత లెగ్‌రూమ్‌ వెడల్పాటి సీట్లు దీని ప్రత్యేకత. ఇందులో 1.0- లీటర్ పెట్రోల్ ఇంజిన్ 19.35km/l మైలేజీని ఇస్తుండగా, టర్బో పెట్రోల్‌ వెర్షన్ 20km/l మైలేజీని అందిస్తుంది. దీని ప్రారంభం ధర రూ. 5, 79,000గా ఉంది. అయితే ఇందులో సీఎన్జీ ఆప్షన్ అందుబాటులో లేదని విషయాన్ని గమనించాలి. 

మంచి డ్రైవింగ్‌ అనుభవంతో స్కోడా కైలాక్‌ 

సబ్‌-4 మీటర్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్‌ ఒక సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. యూరోపియన్ టెక్నాలజీ, డ్రైవింగ్ కంఫర్ట్‌ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. భారత్‌ ఎన్‌క్యాప్‌లో 5- స్టార్‌ రేటింగ్‌ పొందిన ఈ కారు, గుంత రోడ్లపై కూడా కుదుపులు లేకుండా ప్రయాణించడానికి వీలుగా అత్యుత్తమ సస్పెన్షన్ వ్యవస్థను కలిగింది. 10.1 అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ దీని సొంతం. ఇది 1.0 లీటర్‌ టీఎస్‌ఐ టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. మాన్యువల్‌ వెర్షన్ 19.68km/l, ఆటోమేటిక్‌ వెర్షన్ 19.05 km/l మైలేజీని ఇస్తాయి. దీని ధర 7, 59,000 నుంచి ప్రారంభమవుతుంది. 

ఏ కారు ఎవరికి సెట్ అవుతుంది?

మీకు గరిష్ట భద్రత, పటిష్టమైన నిర్మాణం కావాలంటే టాటా పంచ్‌ లేదా స్కోడా కైలాక్‌ వైపు మొగ్గు చూపవచ్చు. టెక్నాలజీ, ఎక్కువ ఫీచర్లు, రిఫైన్డ్‌ ఇంజిన్ కావాలనుకునే వారికి హ్యుందాయ్‌ ఎక్స్టర్‌ ఉత్తమమైంది. తక్కువ ధరలో స్లైలిష్‌ లుక్‌, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కావాలంటే నిస్సాన్ మాగ్నైట్‌ సరైన ఎంపిక. నగర ప్రయాణాలకు, మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చేవారు పంచ్‌ లేదా ఎక్స్టర్‌ సీఎన్జీ వెర్షన్లను పరిశీలించవచ్చు.

Frequently Asked Questions

భారతీయ మార్కెట్లో తక్కువ ధరలో లభించే ఉత్తమ బడ్జెట్ SUVలు ఏవి?

భారతీయ మార్కెట్లో తక్కువ ధరలో లభించే నాలుగు అత్యుత్తమ బడ్జెట్ SUVలు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు స్కోడా కైలాక్.

టాటా పంచ్ SUV యొక్క ముఖ్య భద్రతా లక్షణాలు ఏమిటి?

టాటా పంచ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, పటిష్టమైన నిర్మాణ నాణ్యత వంటి భద్రతా లక్షణాలు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎక్స్టర్ SUVలో ప్రత్యేకమైన ఫీచర్లు ఏమిటి?

ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా డాష్‌క్యామ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను హ్యుందాయ్ ఎక్స్టర్ అందిస్తుంది. అలాగే, అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా వస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ SUV యొక్క ప్రధాన ఆకర్షణలు ఏమిటి?

నిస్సాన్ మాగ్నైట్ 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. దీని బోల్డ్ డిజైన్ రోడ్డుపై ప్రత్యేక గుర్తింపునిస్తుంది.

స్కోడా కైలాక్ SUV ఎవరికి సరైన ఎంపిక?

యూరోపియన్ టెక్నాలజీ, డ్రైవింగ్ కంఫర్ట్ కోరుకునే వారికి స్కోడా కైలాక్ సరైన ఎంపిక. ఇది 5-స్టార్ రేటింగ్‌తో పాటు, గుంత రోడ్లపై కూడా కుదుపులు లేకుండా ప్రయాణించడానికి వీలుగా అత్యుత్తమ సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget