అన్వేషించండి

కొత్త SUV కొనడం కంటే, ఈ 5 పాత సెడాన్‌లు తీసుకోవడం బెటర్.. అందుకు కారణాలివే

Second Hand Sedan: కొత్త కాంపాక్ట్ SUVపై ఖర్చు చేయడం కంటే పాత సెడాన్‌లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాటి ఫీచర్లు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ వల్ల కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త SUVల అధిక ధరలతో పోలిస్తే, పాత సెడాన్ కార్లు మంచి ఎంపిక.
  • పాత సెడాన్లలో ప్రీమియం ఫీచర్లు, మెరుగైన సౌకర్యం, డ్రైవింగ్ అనుభవం లభిస్తాయి.
  • తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఫీల్, అద్భుతమైన సౌకర్యం, డ్రైవింగ్ అనుభవం పొందవచ్చు.
  • తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పనితీరు కోరుకునే వారికి సెడాన్లు ఉత్తమం.

Used Seadan Cars | సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనడం చాలా మందికి ఒక కలగా మారింది. ఎత్తైన బాడీ, రోడ్ ప్రెజెన్స్, సరికొత్త ఫీచర్ల కారణంగా ఎస్‌యూవీలు చాలా వేగంగా పాపులర్ అయ్యాయి. కానీ అనేక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీల ధరలు రూ. 15 నుండి 20 లక్షల వరకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం కంటే మంచి సెకండ్ హ్యాండ్ సెడాన్ (Sedan) కారు కొనడం చాలా ఉత్తమమని పలువురు కార్ నిపుణులు ఇప్పుడు సలహా ఇస్తున్నారు.

పాత సెడాన్ కార్లలో మీకు మరిన్ని ప్రీమియం ఫీచర్లు, మెరుగైన కంఫర్ట్, పవర్‌ఫుల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.  ఒకప్పుడు లగ్జరీ ఫీల్ కోసం ఎన్నో సెడాన్ కార్లు నేడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇదే కారణంతో ఇప్పుడు ఎస్‌యూవీల కంటే మళ్లీ సెడాన్ కార్ల కోసం చూస్తున్నారు. 

తక్కువ ధరలోనే ప్రీమియం ఫీల్, అద్భుతమైన కంఫర్ట్
పాత సెడాన్ కార్ల వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం వాటి కంఫర్ట్, డ్రైవింగ్ క్వాలిటీ. ఉదాహరణకు Honda City, హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna), స్కోడా సూపర్బ్ (Skoda Superb), Toyota Camry మరియు BMW 3 సిరీస్ వంటి కార్లు నేటికీ వాటి స్మూత్ డ్రైవ్ మరియు లగ్జరీ క్యాబిన్ కోసం ఎంతగానో ఇష్టపడతారు. ఈ కార్లలో పొడవైన వీల్‌బేస్ ఉండటంతో వెనుక సీట్లో కూర్చునే వారికి ఎక్కువ స్థలం లభిస్తుంది. హైవేలపై వీటి స్టెబిలిటీ కూడా ఎస్‌యూవీల కంటే బెటర్ అనిపిస్తుంది. 

Also Read: Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు

అనేక పాత సెడాన్ కార్లలో మీకు సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS వంటి ఫీచర్లు ఉంటాయి.  ఇవి కొత్త బడ్జెట్ ఎస్‌యూవీలలో సాధారణంగా ఉండవు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈ కార్ల ధరలు చాలా వరకు తగ్గతాయి.  కాబట్టి తక్కువ బడ్జెట్‌లోనే లగ్జరీ ఫీల్ పొందడం సులువవుతుంది.

డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, వ్యాల్యూ ఫర్ మనీ 
ఎస్‌యూవీల ట్రెండ్ పెరిగినప్పటికీ, డ్రైవింగ్ ఇష్టపడేవారు నేటికీ సెడాన్ కార్లనే ఎక్కువగా లైక్ చేస్తారు. సెడాన్ కారు తక్కువ ఎత్తు, మెరుగైన ఏరోడైనమిక్స్ కారణంగా కారు రోడ్డుపై మరింత కంట్రోల్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది. హైవేలపై వీటి ప్రయాణం ఈజీ. సెకండ్ హ్యాండ్ సెడాన్ కొనడం వల్ల మీ ఆదాయంపై కూడా పెద్దగా భారం పడదు. కొత్త ఎస్‌యూవీ కొనగానే దాని Resale Value వేగంగా తగ్గుతుంది. అదే పాత సెడాన్ కార్ల విలువ అప్పటికే చాలా వరకు తగ్గిపోయి అందుబాటు ధరలోనే లభిస్తుంది. 

Also Read: Hero Electric Optima vs Vida VX2 Go: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

అందుకే తక్కువ మనీకి ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పర్ఫార్మెన్స్ కోరుకునే వారు సెకండ్ మ్యాండ్ సెడాన్  కార్లు కొనాలని చూస్తున్నారు. సరైన పద్ధతిలో మెయింటెనెన్స్ చేసిన కారు గనుక దొరికితే, కొత్త ఎస్‌యూవీ కొనడం కంటే ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫీచర్లతో, మనీకి తగిన వాహనం లభిస్తుందని భావిస్తున్నారు.

Frequently Asked Questions

కొత్త SUVల కంటే సెకండ్ హ్యాండ్ సెడాన్ కారు కొనడం ఎందుకు మంచిది?

సెకండ్ హ్యాండ్ సెడాన్ కార్లలో మీకు మరిన్ని ప్రీమియం ఫీచర్లు, మెరుగైన కంఫర్ట్, మరియు శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది. అంతేకాకుండా, తక్కువ ధరలో లగ్జరీ ఫీల్ సొంతం చేసుకోవచ్చు.

సెకండ్ హ్యాండ్ సెడాన్ కార్లలో ఎలాంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి?

చాలా పాత సెడాన్ కార్లలో సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. ఇవి కొత్త బడ్జెట్ SUVలలో సాధారణంగా కనిపించవు.

సెడాన్ కార్ల డ్రైవింగ్ అనుభవం SUVల కంటే ఎలా ఉంటుంది?

సెడాన్ కార్లు తక్కువ ఎత్తు, మెరుగైన ఏరోడైనమిక్స్ కారణంగా రోడ్డుపై మరింత నియంత్రణలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. హైవేలపై వీటి ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ సెడాన్ కొనడం వల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

సెకండ్ హ్యాండ్ సెడాన్ కారు కొనడం వల్ల మీ ఆదాయంపై పెద్దగా భారం పడదు. కొత్త SUVల Resale Value వేగంగా తగ్గితే, పాత సెడాన్ కార్ల విలువ ఇప్పటికే తగ్గి అందుబాటు ధరల్లో లభిస్తాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget