అన్వేషించండి

CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!

CNG Price Hike 26 May 2026: మరోసారి, ఈ రోజు CNG ధరలు పెరిగాయి. ఢిల్లీ మరియు ఇతర నగరాల్లో ఒక కిలో CNG కోసం మీరు ఇప్పుడు ఎంత చెల్లించాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర రూ. 2 పెరిగింది.
  • దేశంలో మే నెలలో సీఎన్‌జీ ధరలు 4వ సారి పెరిగాయి.
  • ఘజియాబాద్‌లో కిలో సీఎన్‌జీ ధర ₹102.90కు చేరింది.
  • ముంబైలో మాత్రం సీఎన్‌జీ ధర మారకుండా ₹81 వద్ద స్థిరంగా ఉంది.

CNG Price Hike 26 May 2026:

దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మరోవైపు సిఎన్‌జి ధరలు (CNG Price) కూడా జేబుకు చిల్లు పెడుతున్నాయి. మే 26న దేశ రాజధాని ఢిల్లీలో సిఎన్‌జి ధర కిలోకు రూ. 2 మేర పెరిగింది. ఈ తాజా పెంపుతో నిన్నటి వరకు రూ. 81.09 గా ఉన్న సిఎన్‌జి ధర నేడు రూ. 83.09 కి చేరింది.

మెట్రో నగరాలలో హైదరాబాద్‌లో అత్యధికం
దేశంలోని వివిధ నగరాల్లో సిఎన్‌జి ధరలు భిన్నంగా ఉన్నాయి. ఘాజియాబాద్‌లో అత్యధికంగా కిలో సిఎన్‌జి ధర ₹102.90 కి చేరగా, హైదరాబాద్‌లో ₹97.00 అయింది. చెన్నైలో ₹91.50, బెంగళూరులో ₹90 , లక్నో, ఆగ్రాలలో ₹95.75 గా నమోదైంది. అలాగే నోయిడాలో ₹91.70, మరియు జైపూర్‌లో ₹90.91 గా ఉంది. గుర్‌గావ్‌లో ₹84.12, అహ్మదాబాద్‌లో ₹82.25 ఉండగా, ముంబైలో అతి తక్కువగా ₹81.00 గా కొనసాగుతోంది.

ఈ మే నెలలో సిఎన్‌జి ధరలు పెరగడం ఇది నాలుగో సారి. కేవలం 11 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు సవరించారు. మే 26న జరిగిన పెంపునకు ముందు మే 23 శనివారం నాడు కూడా సిఎన్‌జీ కిలోకు రూ. 1 పెరిగింది. అప్పుడు ధర రూ. 80.09 నుండి రూ. 81.09 కి పెరిగింది. దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నా ముంబైలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత నెలలో 50 పైసలు పెరిగిన తర్వాత అక్కడ సిఎన్‌జి రేటు ₹81 వద్దే స్థిరంగా ఉంది.

మే 26, 2026న నగరాల వారీగా సిఎన్‌జి ధరలు:
హైదరాబాద్ (Hyderabad) ₹97.00
ఢిల్లీ (Delhi) ₹83.09
ముంబై (Mumbai) ₹81.00
కోల్‌కతా (Kolkata) ₹93.50
చెన్నై (Chennai) ₹91.50
బెంగళూరు (Bangalore) ₹90.00
నోయిడా (Noida) ₹91.70
ఫరీదాబాద్ (Faridabad) ₹90.30
ఘాజియాబాద్ (Ghaziabad) ₹102.90
గుర్‌గావ్ (గురుగ్రామ్) (Gurugram) ₹84.12
పుణె (Pune) ₹92.50
లక్నో (Lucknow) ₹95.75
ఆగ్రా (Agra) ₹95.75
మీరట్ (Meerut) ₹86.05
పాట్నా (Patna) ₹87.90
ఇండోర్ (Indore) ₹93.55
జైపూర్ (Jaipur) ₹90.91
సూరత్ (Surat) ₹82.95

Also Read: Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే

11 రోజుల్లో నాల్గవ సారి పెరిగిన సిఎన్‌జి ధరలు
ఈ రోజు మే 26న రూ. 2 పెరగడానికి ముందు మే 23 శనివారం నాడు సిఎన్‌జి ధరలు కిలోకు రూ. 1 .. అంతకుముందు CNG రేటు 80.09 పైసలు ఉండగా, అది పెరిగి 81.09 పైసలు అయింది. మే నెలలో ఇప్పటివరకు 4 సార్లు సిఎన్‌జి ధరలు పెంచారు. మరింత పెరుగతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ముంబైలో ధరలు మారలేదా?
ముంబైలో సిఎన్‌జి ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. గత నెలలో ధర 50 పైసలు పెరిగింది, అప్పటి నుండి దీని రేటు ₹81 గానే ఉంది.

Frequently Asked Questions

మే 26, 2026న ఢిల్లీలో సీఎన్‌జీ ధర ఎంత పెరిగింది?

మే 26, 2026న ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. దీనితో ధర రూ. 83.09 కి చేరింది.

మే నెలలో సీఎన్‌జీ ధరలు ఎన్నిసార్లు పెరిగాయి?

మే నెలలో సీఎన్‌జీ ధరలు 11 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు పెరిగాయి.

దేశంలో అత్యధిక సీఎన్‌జీ ధర ఏ నగరంలో ఉంది?

దేశంలో అత్యధిక సీఎన్‌జీ ధర ఘాజియాబాద్‌లో కిలోకు ₹102.90 గా ఉంది.

ముంబైలో సీఎన్‌జీ ధరలో మార్పు ఉందా?

ముంబైలో సీఎన్‌జీ ధరల్లో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. గత నెలలో 50 పైసలు పెరిగిన తర్వాత ధర ₹81 గానే ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget