అన్వేషించండి

Hero Electric Optima vs Vida VX2 Go: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

Hero Electric Optima vs Vida VX2 Go: బడ్జెట్‌ ధరలో ఎలక్ట్రిక్ ఆప్టిమా, ఆత్యాధునిక ఫీచర్లతో విడా VX2 గో... ఈ రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో మీ రోజువారీ ప్రయాణాలకు ఏది సరైందో తెలుసుకోండి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెట్రోల్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం.
  • హీరో ఆప్టిమా: సామాన్యుడికి అందుబాటులో, సులభమైన డిజైన్, నమ్మకమైన పనితీరు.
  • విడా VX2 గో: ప్రీమియం ఫీచర్లు, వేగవంతమైన పనితీరు, టెక్నాలజీ ప్రియులకు ఆకర్షణీయం.
  • రెండు స్కూటర్ల మధ్య మోటార్, వేగం, ఛార్జింగ్, ధరలలో స్పష్టమైన తేడాలున్నాయి.

Hero Electric Optima vs Vida VX2 Go: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం ఇప్పుడు రెండో దశకు చేరుకుంది. ఒకప్పుడు కేవలంం పర్యావరణ హితం అని చెప్పుకునే వాహనాలు ఇప్పుడు పెర్ఫార్మెన్స్‌, సేవింగ్స్ మంత్రంతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మత పెట్రోల్‌ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈవీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మన ముందున్న రెండు మంచి ఆప్షన్లు హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా, విడా VX2 గో. 

ఈ రెండు కూడా హీరో నుంచి వచ్చినప్పటికీ, వీటి స్వభావం, టెక్నాలజీ, టార్గెట్ ఆడియన్స్‌ పూర్తిగా భిన్నం. ఈ రెండు స్కూటర్ల మధ్య ఉన్న ప్రతి చిన్న వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం. 

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా భారత్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ల రంగంలో ఒక వెటరన్ లాంటిది. సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు, సామాన్యుడికి అందుబాటులో ఉన్న ధర దీని ప్రధాన బలం. ఇది కేవలం 93 కేజీల బరువుతో ఉంటుంది. దీని వల్ల ట్రాఫిక్‌లో నడపం చాలా ఈజీ. 

విడా VX2 గో హీరో సంస్థ నుంచి ప్రీమియం  బ్రాండ్‌. టెక్నాలజీ ప్రియులను వేగాన్ని కోరుకునే యువతను ఉద్దేశించిన దీనిని రూపొందించారు. ఇందులో వాడిన PMSM మోటార్, రిమూవబుల్‌ బ్యాటరీ టెక్నాలజీ దీనికి ప్రత్యేకతను తీసుకొస్తోంది. 

ధరలో ఉన్న వ్యత్యాసం  

ధర విషయానికి వస్తే, హీరో ఆప్టిమా ఎక్స్‌షోరూమ్‌ ధర సుమారు రూ. 83వేలు కాగా, విడా VX2 గో ధర 99 వేలు. అంటే సుమారు 16వేలు తేడాగా ఉంది.

ఆప్టిమాలో 1.2kW BLDC మోటార్ ఉంటే, విడాలో ఏకంగా 6kW శక్తివంతమైన PMSM మోటార్ ఉంది. ఇది  కొండ ప్రాంతాల్లో లేదా ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన పవర్ ఇస్తుంది. ఆప్టిమా టాప్ స్పీడ్‌ 4km/h మాత్రమే. కానీ విడా VX2 గో 70km/hవేగంతో దూసుకుపోగలదు. విడాలో బ్లూటూత్‌ కనెక్టివిటీ, నేవిగేషన్, స్మార్ట్‌ఫోన్ ద్వారా కాల్/sms అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆప్టిమాలో ఇవి అందుబాటులో లేవు.

చిత్రమైన విషయం ఏమిటంటే, రెండింటి రేంజ్‌ దాదాపు సమానం. ఆప్టిమా 8 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంటే, విడా 92 కిలోమీటర్లు ఇస్తుంది. కానీ, విడాలో ఉన్న రిమూవబుల్ బ్యాటరీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా చెబుతున్నారు. విడా VX2 గో ఛార్జింగ్‌ కేవలం 3.53 గంటల్లో పూర్తి అవుతుంది. పైగా ఇదులో ఫాస్ట్ చార్జింగ్‌ (రెండు గంటలు) సదుపాయం కాడూ ఉంది. ఆప్టిమాకు 4.5 గంటల సమయం పడుతుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం లేదు. 

ఫీచర్‌    హీరో ఆప్టిమా CX 2.0   విడా VX2 గో 
మోటార్‌ పవర్  1.2kW(BLDC)  6kW(PMSM)
టాప్ స్పీడ్   48km/Hr    70km/Hr

రేంజ్‌

89km/Charge   92km/Charge 
ఛార్జింగ్ టైమ్‌   4.5Hr    3.53Hr

బరువు   

93 kg     106 kg
అండర్‌ సీట్‌ స్టోరేజ్‌ ఉంది  33.2L
గ్రేడబిలిటీ(ఎత్తైన ప్రదేశాలు ఎక్కే శక్తి )     7 డిగ్రీలు     15 డిగ్రీలు 

రోజువారి పనుల కోసం, పిల్లలను స్కూల్‌లో డ్రాప్‌ చేయడానికి ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి హీరో ఆప్టిమా సరిపోతుంది. మీ ఆఫీస్‌ దూరం కొంచెం దూరం ఎక్కువగా ఉండి, మీరు ట్రాఫిక్‌లో వేగంగా వెళ్లాలనుకుంటే విడా VX2 గో ఉత్తమమైంది. 

Frequently Asked Questions

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా మరియు విడా VX2 గో మధ్య ధరలో ఎంత వ్యత్యాసం ఉంది?

హీరో ఆప్టిమా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 83,000 కాగా, విడా VX2 గో ధర రూ. 99,000. అంటే సుమారు రూ. 16,000 వ్యత్యాసం ఉంది.

హీరో ఆప్టిమా మరియు విడా VX2 గో యొక్క టాప్ స్పీడ్ ఎంత?

హీరో ఆప్టిమా టాప్ స్పీడ్ 48 km/hr కాగా, విడా VX2 గో 70 km/hr వేగంతో దూసుకుపోగలదు.

ఈ రెండు స్కూటర్లలో ఏది ఎక్కువ రేంజ్ ఇస్తుంది?

ఈ రెండు స్కూటర్ల రేంజ్ దాదాపు సమానంగా ఉంటుంది. ఆప్టిమా 89 కిలోమీటర్లు, విడా VX2 గో 92 కిలోమీటర్లు అందిస్తాయి.

విడా VX2 గో లో ఉన్న ప్రత్యేక ఫీచర్లు ఏమిటి?

విడా VX2 గో లో బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్, స్మార్ట్‌ఫోన్ ద్వారా కాల్/sms అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి PMSM మోటార్, రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ కూడా ప్రత్యేకతను ఇస్తున్నాయి.

రోజువారీ పనులకు మరియు కొంచెం ఎక్కువ దూర ప్రయాణాలకు ఏ స్కూటర్ ఉత్తమం?

రోజువారీ పనులకు, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడానికి హీరో ఆప్టిమా సరిపోతుంది. ఆఫీస్‌ ప్రయాణాలకు, ట్రాఫిక్‌లో వేగంగా వెళ్లాలనుకుంటే విడా VX2 గో ఉత్తమమైంది.

టాప్ హెడ్ లైన్స్

Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!
EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!
Skoda Slavia Facelift EMI: నెలకు సుమారు రూ.14 వేలు కట్టి ఈ ప్రీమియం సెడాన్‌ను సొంతం చేసుకోండి!
Skoda Slavia Facelift ఆన్‌రోడ్‌ రేటు ఎంత పడుతుంది? కార్‌ లోన్‌ ఎంత వస్తుంది?
కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
Skoda Slavia Facelift: చిన్న మార్పులు, పెద్ద ప్రభావం.. ఇప్పుడు మరింత మోడ్రన్‌గా!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget