అన్వేషించండి

Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

Affordable Electric SUVs in India 2026: భారత్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల హవా మొదలైంది. టాటా, మారుతి, మహీంద్రా వంటి దిగ్గజాలు అందిస్తున్న బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఈవీలు చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలవైపు ప్రజల ఆసక్తి పెరిగింది.
  • తక్కువ ధరల్లో టాటా పంచ్ ఈవీ, సిట్రోయెన్ eC3 లభిస్తున్నాయి.
  • టాటా నెక్సాన్, మహీంద్రా XUV400, మారుతి e విటారా అధిక రేంజ్ అందిస్తాయి.
  • ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి.

Affordable Electric SUVs in India 2026: భారత్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ, వాటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటం, మెరుగైన రేంజ్ లభిస్తుండటంతో వినియోగదారులు వీటిని పెట్రోల్‌ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు తర్వాత, విద్యుత్‌ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. 

ప్రస్తుతం భారత మార్కెట్‌లో పోటీ పడుతున్న ఐదు అత్యుత్తమ ఎలక్ట్రిక్ ఎస్‌యువీల గురించి, వాటి ప్రత్యేకతలు, ధరలు, గురించి ఇక్కడ చూద్దాం. 

టాటా పంచ్‌ ఈవీ 

సామాన్యుడికి అందుబాటులో ధరల్లో లభించే అత్యుత్తమ ఈవీ ఎస్‌యూవీగా నిలిచింది. తక్కువ ధరలు లభించమే కాకుండా, ఫీచర్స్ విషయంలో కూడా దిగ్గజాలతో పోటీ పడుతోంది. అందుకే దీన్ని కొనేందుకు వినియోగదారులు బారులు తీరుతున్నారు. 

Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

టాటా పంచ్ ఈవీ కారు ప్రారంభ ధర 9.69 లక్షలుగా ఉంది. ఇందులో టాప్ వేరియంట్‌ ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో 360 డిగ్రీల కెమెరా, డ్యూయల్ డిజిటల్‌ స్క్రీన్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

సిట్రోయెన్ eC3 

బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ క్రాస్‌ ఓవర్ ఎస్‌యూవీగా సిట్రోయెన్‌ eC3 తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. దీని ప్రారంభ ధర 12.90 లక్షలు. రేంజ్‌ సుమారు 320 కిలోమీటర్లు రేంజ్‌ ఇది అందిస్తుంది. సిటీలో సులువుగా నడపడానికి, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది.

టాటా నెక్సాన్‌ ఈవీ

భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్‌ ఈవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒక్క ఛార్జ్‌తో దాదాపు 465 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది. పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ వంటి విలాసవంతమైన ఫీచర్లు దీని సొంతం. 

Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

మహీంద్రా XUV400 EV 

ఎక్కువ ఇంటీరియర్‌, శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వారికి మహీంద్రా XUV400 సరైన ఎంపిక. దీని ధర 15.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ను బట్టి 456 కిలోమీటర్ల వరకు రేంజ్‌ అందిస్తుంది. 

Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

మారుతి సుజుకి e విటారా

ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకి వేస్తున్న భారీ అడుగు eవిటారా. దీని ప్రారంభ ధర సుమారు 15.99 లక్షలు ఉండొచ్చని అంచనా. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 500కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం. ఇందులో ఆధునిక బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీని వాడుతున్నారు. ఇది భద్రత, సామర్థ్యానికి ఫేమస్. Affordable Electric SUVs in India 2026: పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ రూ. 10 లక్షల నుంచే వచ్చే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు! ఒక్క చార్జ్‌తో 500 కి.మీ ప్రయాణం

పెట్రోల్ కార్లతో పోలిస్తే, ఎలక్ట్రిక్‌ వాహనాల రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ. ఒక కిలోమీటర్‌కు పెట్రోల్ కారుకు 7-10 రూపాయలు ఖర్చు అయితే ఈవీ కేవలం 1-1.50 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. గ్రీన్ ప్లేట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, ప్రభుత్వ సబ్సిడీలు లభిస్తాయి.  

ప్రస్తుతం ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వేగంగా విస్తరిస్తోంది. టాటా, మారుతి, వంటి సంస్థలు 2026 నాటికి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. కాట్టి సెకండ్‌ కార్‌గా కాకుండా, ప్రైమరీ కార్‌గా ఈవీని కొనేందుకు ఇదే సరైన టైం. 

Also Read: ట్రయంఫ్ టైగర్ 900 సరికొత్త ఎడిషన్లు లాంచ్ - ఆల్పైన్, డెజర్ట్ మోడళ్ల ఫీచర్లు, ప్రైస్ డీటైల్స్

కంపెనీలు చెప్పే రేంజ్‌కి, అసలు రోడ్లపై వచ్చే రేంజ్‌కి కొంత తేడా ఉంటుంది. 468 క్లైమ్‌ చేసిన కారు సాధారణంగా 350-380 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ఏసీ వాడకం, ట్రాఫిక్, మీ డ్రైవింగ్ స్కిల్‌పై ఆధారపడి ఉంటుంది. 

ఇప్పుడు వస్తున్న అన్ని ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలు హోమ్ ఛార్జింగ్‌తోపాటు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. ఇంటి వద్ద ఛార్జ్ చేస్తే 8-10 గంటలు పడితే, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కేవలం 60 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ నిండుతుంది. 

Also Read: పెరిగిన పెట్రో ధ‌ర‌లు: ఇంధన ఖర్చులు తగ్గించుకునేలా డ్రైవింగ్ హ్యాబిట్స్, మెయింటెనెన్స్ వివరాలు ఇవే

గత మూడేళ్లలో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ 200 శాతం వృద్ధిని సాధించింది. టాటా మోటార్స్ ప్రారంభించిన ఈ పయనం ఇప్పుడు మారుతి, మహీంద్రా వంటి స్వదేశీ దిగ్గజాలతో పాటు సిట్రోయెన్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ల పోటీతో మరింత ఆసక్తికరంగా మారింది. మీరు పర్యావరణానికి మేలు చేయడంతోపాటు, మీ నెలవారీ ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే, పైన పేర్కొన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అద్భుతమైన ఆప్షన్లు. ముఖ్యంగా టాటా పంచ్ ఈవీ బడ్జెట్‌ వినియోగదారులకు, మారుతి e విటారా సుదూర ప్రయాణాలు చేసే వారికి మంచి ఎంపికగా నిలుస్తాయి. 

Also Read: నిసాన్ టక్టాన్‌ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్‌... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!

Frequently Asked Questions

భారతదేశంలో ఎలక్ట్రిక్ SUVలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, తక్కువ నిర్వహణ ఖర్చులు మరియు మంచి రేంజ్ కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ SUV ఏది?

టాటా పంచ్ EV తక్కువ ధరకే లభిస్తూ, మంచి ఫీచర్లతో సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది.

ఎలక్ట్రిక్ SUVల నిర్వహణ ఖర్చు ఎంత?

పెట్రోల్ కార్లతో పోలిస్తే, ఎలక్ట్రిక్ SUVల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. కిలోమీటరుకు సుమారు 1-1.50 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది.

ఎలక్ట్రిక్ SUVల ఛార్జింగ్ సమయం ఎంత?

ఇంట్లో ఛార్జింగ్ చేస్తే 8-10 గంటలు పడుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో 60 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget