అన్వేషించండి

Triumph Tiger 900 Alpine, Desert Launched: ట్రయంఫ్ టైగర్ 900 సరికొత్త ఎడిషన్లు లాంచ్ - ఆల్పైన్, డెజర్ట్ మోడళ్ల ఫీచర్లు, ప్రైస్ డీటైల్స్

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియాలో టైగర్ 900 ఆల్పైన్, డెజర్ట్ స్పెషల్ ఎడిషన్లను ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.35 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది.

Triumph Tiger 900 Alpine and Desert Editions Launched In India: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియాలో తన ప్రీమియం అడ్వెంచర్ బైక్ లైనప్‌ను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా సరికొత్త ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్, ట్రయంఫ్ టైగర్ 900 డెజర్ట్ ఎడిషన్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్ లో ట్రయంఫ్ టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 15.35 లక్షలుగా నిర్ణయించగా, ట్రయంఫ్ టైగర్ 900 డెజర్ట్ ఎడిషన్ ధర రూ. 16.05 లక్షలుగా ఉంది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌లు ఎక్స్‌క్లూజివ్ పెయింట్ స్కీమ్స్, ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ యాక్సెసరీలతో లాంగ్ టూరింగ్, ఆఫ్-రోడ్ రైడర్లను ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డాయి.

Read Also: City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు

లాంగ్ టూరింగ్ డిజైన్ ఫీచర్లు..

టైగర్ 900 ఆల్పైన్ ఎడిషన్ మోడల్ జీటీ ప్రో (GT Pro) వేరియంట్ ఆధారంగా రూపొందింది. హైవేలు, తారు రోడ్లపై ఎక్కువ సమయం లాంగ్ రైడింగ్ చేయడానికి ఇష్టపడే రైడర్ల కోసం దీనిని తయారు చేశారు. ఈ బైక్‌కు క్లాసీ స్నోడోనియా వైట్, సఫైర్ బ్లాక్ కలర్ స్కీమ్‌తో పాటు బ్లూ కలర్ యాక్సెంట్స్ అందించారు. కాస్మెటిక్ మార్పులతో పాటు ఈ ఆల్పైన్ ఎడిషన్‌లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఇంజన్ ప్రొటెక్షన్ బార్స్, అక్రాపోవిక్ (Akrapovic) ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్‌తో పాటు టూరింగ్ కంఫర్ట్‌ను మెరుగుపరచడానికి ఈ సెటప్ ఉపయోగపడుతుంది. ఇందులో ప్రీమియం టీఎఫ్‌టీ (TFT) ఇన్‌స్ట్రుమెంటేషన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ ఉన్నాయి.

Read Also: Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు

రగ్గడ్ ఆఫ్‌రోడ్ హార్డ్‌వేర్..

టైగర్ 900 డెజర్ట్ ఎడిషన్ మోడల్ ర్యాలీ ప్రో (Rally Pro) వేరియంట్ ఆధారంగా మరింత రగ్గడ్ లుక్ తో పవర్‌ఫుల్ గా వచ్చింది. ఇందులో బాజా ఆరెంజ్ హైలైట్స్‌తో పాటు ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, అడ్వెంచర్-ఫోకస్డ్ స్టైలింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో ఫ్యూయల్ ట్యాంక్ ప్రొటెక్షన్ బార్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్, అక్రాపోవిక్ సైలెన్సర్‌ను అమర్చారు. ఆఫ్-రోడ్ రైడింగ్‌కు వీలుగా ముందు భాగంలో 21-ఇంచుల వీల్, వెనుక వైపు 17-ఇంచుల వీల్ సెటప్‌ను అందించారు. ఈ డెజర్ట్ ఎడిషన్ అదనపు యాక్సెసరీలు, యూనిక్ స్టైలింగ్‌తో వచ్చినప్పటికీ, స్టాండర్డ్ ర్యాలీ ప్రో మోడల్ కంటే రూ. 10,000 తక్కువ ధరకే లభించడం విశేషం.

పవర్‌ఫుల్ ఇంజన్ పర్ఫార్మెన్స్.. 

ఈ రెండు స్పెషల్ ఎడిషన్ బైక్‌లలో ట్రయంఫ్ బ్రాండ్‌కు చెందిన 888 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ టీ-ప్లేన్ (T-Plane) ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ పవర్‌ఫుల్ మోటార్ 9,500 ఆర్‌పీఎమ్ వద్ద 108 హెచ్‌పీ పవర్‌ను, 6,850 ఆర్‌పీఎమ్ వద్ద 90 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రైడర్ల సౌకర్యార్థం బయో-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను స్టాండర్డ్‌గా అందించారు. ఇరు మోటార్‌సైకిళ్లలో ప్రీమియం సస్పెన్షన్ హార్డ్‌వేర్‌తో పాటు రైడర్ల సేఫ్టీ కోసం అడ్వాన్స్‌డ్ రైడర్ ఎయిడ్స్ ఫీచర్లను కూడా కంటిన్యూ చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget