అన్వేషించండి

Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు

Kia India Announces Massive Discounts: ఇండియాలో మే 2026 నెల కోసం కియా మోటార్స్ తన ఎస్‌యూవీ, ఎంపీవీ కార్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది.

Kia India Announces Massive Discounts And Offers Across Lineup: కియా ఇండియా తన కార్ల లైనప్‌పై మే 2026 నెలకు సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో కొత్త కియా ఎస్‌యూవీ (SUV) లేదా ఎంపీవీ (MPV) కారు కొనాలనుకునే కస్టమర్లు సెలెక్ట్ చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. కియా కార్నివాల్, కియా కారెన్స్ క్లావిస్, కియా సెల్టోస్, కియా సైరోస్, కియా సోనెట్ వంటి మోడళ్లు ఈ ఆఫర్ల జాబితాలో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లలో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ రివార్డ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. డీలర్‌షిప్ స్టాక్, నగరం, కొనుగోలుదారుల అర్హత ఆధారంగా ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంటుంది.

కార్నివాల్, కారెన్స్ క్లావిస్ మోడళ్లపై బిగ్ డిస్కౌంట్లు

ఈ నెలలో లగ్జరీ ఎంపీవీ కియా కార్నివాల్‌పై అత్యధికంగా రూ. 2.70 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 2 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ సపోర్ట్ తో పాటు స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్స్ ఉన్నాయి. ప్రీమియం ఫ్యామిలీ కారుగా పేరు తెచ్చుకున్న కియా కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. వీటితో పాటు ఉచితంగా 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ లభిస్తుంది. దీని డీజిల్, నార్మల్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. కారెన్స్ క్లావిస్ ఈవీ (EV) ఎలక్ట్రిక్ మోడల్ కొనేవారికి రూ. 2.15 లక్షల వరకు టోటల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

Read Also: Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..

సెల్టోస్, సైరోస్ కార్లపై ..

కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ కియా సెల్టోస్ ఎమ్‌వై25 (MY25) స్టాక్‌పై రూ. 95,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ప్రీమియం క్యాబిన్, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ఉండే ఈ కారు మార్కెట్ లో హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. మరో మోడల్ కియా సైరోస్ ఎమ్‌వై25 ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు బెనిఫిట్స్ ఉండగా, కొత్త ఎమ్‌వై26 (MY26) యూనిట్లపై రూ. 50,000 వరకు తక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ లోడెడ్ ఇంటీరియర్ ఇష్టపడే కస్టమర్లను ఈ కార్లు బాగా ఆకట్టుకుంటున్నాయి.

Read Also: City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు

సోనెట్, స్టాండర్డ్ కారెన్స్ పై క్యాష్ బెనిఫిట్స్

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న కియా సోనెట్ ఎమ్‌వై26 స్టాక్‌పై రూ. 35,000 వరకు, ఎమ్‌వై25 యూనిట్లపై రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు మార్కెట్ లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO లతో పోటీ పడుతోంది. వీటితో పాటు స్టాండర్డ్ కియా కారెన్స్ మోడల్ పై ఈ నెల రూ. 40,000 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ స్పేస్, మోడర్న్ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈ ఎంపీవీ కారు మంచి ఆప్షన్ గా నిలుస్తోంది. ఖచ్చితమైన ఆఫర్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీప కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

How To Protect Bike During Heavy Rain:వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
Upcoming SUVs List: మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget