అన్వేషించండి

India's First E100 Flex Fuel Car: ఇండియాలో మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: వ‌చ్చేనెల‌లో ఈ100 వెహికల్‌ను తీసుకురానున్న మారుతి సుజుకి

పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న మారుతి సుజుకి దేశంలోనే మొదటి ఈ100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును లాంచ్ చేయనున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు.

Maruti Suzuki to Launch Indias First E100 Flex Fuel Car: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఒక సరికొత్త విప్లవం రాబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం (Environment Day) సందర్భంగా ఢిల్లీలో జరగబోయే ఒక స్పెషల్ ప్రోగ్రామ్‌లో మారుతి సుజుకి తన సరికొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) వాహనాన్ని లాంచ్ చేయనుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గ్రీన్ ఫ్యూయల్స్ వైపు మొగ్గు చూపాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. జూన్ 5, 2026 న మారుతి సుజుకి కంపెనీ 100 శాతం ఇథనాల్ (E100) బ్లెండ్స్ తో నడిచే ఈ సరికొత్త వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించనుంది.

Read Also: Honda City Facelift News: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే

దేశంలోనే మొదటి 4W ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్

ప్రస్తుతం భారతదేశంలో లభించే ఫోర్ వీలర్లలో ఒక్కటి కూడా పూర్తి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ తో అందుబాటులో లేదు. రాబోయే మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్, దేశంలోనే ఈ100 (ఇథనాల్ 100 శాతం) ఇంధన కలయికతో నడిచే మొదటి ఫోర్ వీలర్ వెహికల్‌గా రికార్డు సృష్టించనుంది. దీని కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్యూయల్ స్టోరేజ్, డెలివరీ, ఇగ్నిషన్ సిస్టమ్‌లను ఇంజన్ లో అమర్చారు. గత ఏడాది టోక్యోలో జరిగిన జపాన్ మొబిలిటీ షో 2025 లో సుజుకి కంపెనీ ఫ్రాంక్స్ (Fronx) సబ్ 4ఎమ్ కూపే ఎస్‌యూవీ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను ప్రదర్శించింది. అయితే అప్పట్లో చూపించిన మోడల్ కేవలం ఈ85 (85 శాతం ఇథనాల్) బ్లెండ్స్ కు మాత్రమే సపోర్ట్ చేసేలా ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త మోడల్ నేరుగా ఈ100 టెక్నాలజీతో రానుంది.

Read Also: AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

స్పెషల్ ఇంజన్ టెక్నాలజీ.. 

సాధారణ పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ కు తేమను (Moisture) పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే హై లెవెల్ ఇథనాల్ కాన్సెంట్రేషన్లను తట్టుకోవడానికి వీలుగా కార్లలో స్పెషల్లీ డిజైన్డ్ ఫ్యూయల్ సిస్టమ్స్, యాంటీ రస్ట్ ఇంజన్ కాంపోనెంట్స్ అవసరమవుతాయి. మారుతి సుజుకి ఈ ప్రోటోటైప్ ఇంజన్ ను పక్కాగా అప్‌గ్రేడ్ చేసింది. నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం, ఇంధనాల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడం వల్ల తక్కువ ఖర్చుతో, కాలుష్య రహితంగా స్వదేశీ ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇది అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గుల నుండి భారత్‌కు రక్షణ ఇస్తూ, మన దేశ ముడి చమురు దిగుమతుల (ప్రస్తుతం 87 శాతం) భారాన్ని భారీగా తగ్గిస్తుంది.

ఆటోమొబైల్ రంగంలో తదుపరి అడుగు

భారత మార్కెట్లో టయోటా, టాటా, మహీంద్రా, సుజుకి సహా మొత్తం 12 కంపెనీలు ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్ వాహనాలను ప్రదర్శించాయి. హోండా, సుజుకి వంటి కంపెనీల వల్ల టూ వీలర్ సెగ్మెంట్‌లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు వచ్చాయి. స్కూటర్లు, కార్లు, ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్ల సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) వాడకం పెరగడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఈ20 పెట్రోల్ ప్రమాణాలను ఖరారు చేయగా, తదుపరి రోడ్‌మ్యాప్ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధనాల స్పెసిఫికేషన్లను జారీ చేసింది.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget