అన్వేషించండి

Petrol Price Today:పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయా? మీ సిటీలో ఏ రేటు ఉందో చూడండి!

Petrol Price:మే 20న పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గత వారంలో జరిగిన వరుస పెంపులతో వినియోగదారులపై భారం పడింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర దేశంలోనే గరిష్ట స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.
  • హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి.
  • ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.
  • చర్చలు విఫలమైతే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Petrol Diesel Price Today India:మే 20 బుధవారం నాడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌పై సుమారు 90 పైసలు, డీజిల్‌పై 91 పైసలు మేర పెంచిన సంగతి తెలిసిందే. ఒకే వారంలో రెండుసార్లు ధరలు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా మే 15, శుక్రవారం నాడు ఏకంగా లీటర్‌కు 3 రూపాయల చొప్పున పెంచడం గత నాలుగేళ్లలో అతి పెద్ద పెంపు. 

ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 111. 84 నుంచి 111. 88 వరకు ఉంది. డీజిల్‌ ధర 99.95 రూపాయలకు చేరిం. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే అమరావతిలో 113.98 రూపాయలుగా ఉంది. ఇక్కడ డీజిల్ ధర 101. 66 రూపాయలుగా ఉంది. సీఎన్జీ రేటు 91,60గా ఉంది. పీఎన్జీ 50 రూపాయలకు సప్లై చేస్తున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో డీజిల్ ధరలు అత్యధికంగా 100.59 రూపాయలుగా ఉంది. దేశంలోనే అత్యంత తక్కువ ధరలు చండీగఢ్‌లో ఉన్నాయి. అక్కడ పెట్రోల్ 98.10 గా ఉంది. 

భారత్‌ తన ముడి చమురు అవసరాలలో 85-90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను పెంచుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో  వంతు వాటా కలిగిన హర్మూజ్ జల సంది మార్గంలో ఏర్పడిన అడ్డంకులు సప్లై చెయిన్‌ దెబ్బ తీశాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి రోజూ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దీనిని భర్తీ చేసేందుకు ధరలు పెంపును చేపట్టాల్సి వస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగియవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చల్లో పురోగతి ఉందని తెలపడంతో బుధవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్ ఫ్యూచర్స్‌ 45 సెంట్లు తగ్గి 110.83 డాలర్ల వద్దకు చేరింది.   అయినప్పటికీ సరఫరా ప్రమాదాలు ఇంకా తొలగిపోలేదని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సిటీ గ్రూప్‌ వంటి ఆర్థిక సంస్థలు సమీప భవిష్యత్‌్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. 

పెరుగుతున్న చమురు ధరలు భారత్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి. రూపాయి విలువ కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో 96. 53కు పడిపోవడం ఆర్థిక వ్యవస్థను కలవర పెడుతోంది. ఇంధన ధరల పెరుగుదల రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఛార్జీల పెంపునకు డిమాండ్ చేస్తూ సమ్మెలు చేస్తున్నారు. 

అంతర్జాతీయంగా శాంతి చర్చలు సఫలమైతేనే చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి రోజువారీ ధరల సవరణలో భాగంగా రేట్లు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సామాన్యుల తమ ఇంధన వినియోగంపై నియంత్రణ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

మరిన్ని లేటెస్ట్ ఆటో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Frequently Asked Questions

నేడు (మే 20) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?

మే 20 బుధవారం నాడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు ధరలు పెంచారు.

ఈ వారం పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?

ఈ వారంలో రెండుసార్లు ధరలు పెరిగాయి. మే 15 శుక్రవారం నాడు లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచడం గత నాలుగేళ్లలో అతి పెద్ద పెంపు.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడ అత్యధికంగా, ఎక్కడ తక్కువగా ఉన్నాయి?

కేరళ రాజధాని తిరువనంతపురంలో డీజిల్ ధరలు అత్యధికంగా 100.59 రూపాయలుగా ఉంది. దేశంలోనే అత్యంత తక్కువ ధరలు చండీగఢ్‌లో ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

భారత్ తన ముడి చమురు అవసరాలలో 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను పెంచుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ 
రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ 
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
DMK Exits INDIA Alliance 2026: ఇండియా కూటమి ఉన్నా లేనట్లే - రాహులే బలహీనపరుస్తున్నారా? డీఎంకే ఆరోపణల్లో నిజం ఉందా?
ఇండియా కూటమి ఉన్నా లేనట్లే - రాహులే బలహీనపరుస్తున్నారా? డీఎంకే ఆరోపణల్లో నిజం ఉందా?
Lok Sabha Delimitation 2026 Issue: డీలిమిటేషన్ సెగ - శశిథరూర్ జీతాల లాజిక్‌కు నారా లోకేష్ కాన్స్టిట్యూషన్ కౌంటర్ - లెక్క సరిపోతుందా!?
డీలిమిటేషన్ సెగ - శశిథరూర్ జీతాల లాజిక్‌కు నారా లోకేష్ కాన్స్టిట్యూషన్ కౌంటర్ - లెక్క సరిపోతుందా!?
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget